జాతీయ వార్తలు

వారం రోజుల్లో మందిరంపై నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మథుర, మార్చి 4: అయోధ్యలో రామమందిర నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం వారం రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ భాయ్ తొగాడియా సూచనప్రాయంగా తెలిపారు. రామ మందిర నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం ఏ రకమైన నిర్ణయం తీసుకోకుండా పక్కన పెట్టడంపై విలేఖరులు అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిచ్చారు. ‘వారం రోజుల్లో కేంద్రం ఏదో ఒక నిర్ణయం తీసుకోవచ్చు’ అని పేర్కొన్నారు. ‘అయోధ్యలో రామ మందిర నిర్మాణంపై నిర్ణయాన్ని పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక గంటలో నిర్ణయం తీసుకోవచ్చు. మందిర నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్న అనంతరం మిగతా లాంఛనాలు ఒకదాని వెంట ఒకటిగా పూర్తవుతాయి’ అని తొగాడియా అన్నారు. ఆస్ట్రేలియా, అమెరికా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, సౌదీ అరేబియాల్లో నివసించే హిందువులను రక్షించాల్సిన బాధ్యత భారత ప్రభుత్వంపై ఉందని ఆయన వ్యాఖ్యానించారు. గోరక్షకులకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన అడ్వైజరీని వెంటనే ఉపసంహరించాలని ఆయన డిమాండ్ చేశారు. పాకిస్తాన్‌కు తుపాకులతోనే బుద్ధి చెప్పాలని తొగాడియా పేర్కొన్నారు.