జాతీయ వార్తలు

సర్జికల్ దాడులపైనా రాజకీయాలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాన్‌పూర్, మార్చి 4: దేశ భద్రతకోసం సర్జికల్ దాడులకు నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీలు వాటిని కూడా రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ దుయ్యబట్టారు. సమాజ్‌వాది పార్టీకి అవినీతి తప్ప మరోటి తెలియదని, మహిళల భద్రత గురించి ఏమాత్రం పట్టించుకోలేదని అన్నారు. శనివారం జాన్‌పూర్‌లో జరిగిన ఓ ఎన్నికల సభలో ప్రధాని మాట్లాడుతూ సర్జికల్ దాడులను ప్రశ్నిస్తున్న వారు జాన్‌పూర్ వెళ్లి అమరవీరుల కుటుంబాలతో మాట్లాడితే సర్జికల్ దాడులు నిజమో కాదో తెలుస్తుందని అన్నారు. దేశ భద్రతకు సంబంధించిన అంశాన్ని కూడా రాజకీయం చేస్తున్నందుకు ప్రతిపక్షాల వారికి సిగ్గు లేదని అన్నారు. సైన్యం సంక్షేమం గురించి నిజంగా పట్టించుకొనేది బిజెపియేనని ఆయన చెప్పారు. ‘ఒకే ర్యాంక్ -ఒకే పెన్షన్ పథకం’ కోసం గత యుపిఏ ప్రభుత్వం కేవలం 500 కోట్లు కేటాయించిందని, తాము అధికారంలోకి వచ్చాక దీనికి 1200 కోట్లు కేటాయించామని ప్రధాని చెప్పారు.
నోట్ల రద్దు విజయవంతమైందని ఆర్థిక నిపుణులు, అంతర్జాతీయ సంస్థలు సైతం అంటూ ఉంటే ప్రతిపక్షాలు మాత్రం దాన్ని విమర్శిస్తున్నాయని అన్నారు. ‘బువాజీ, భతీజా, భతీజా స్నేహితుడు.. ముగ్గురికీ మాత్రం నోట్ల రద్దు ఇబ్బందికరంగా ఉంది’ అని బిఎస్పీ అధినేత్రి మాయావతి, సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలను ఉద్దేశించి అన్నారు. సమాజ్‌వాది పార్టీ కొందరికోసమే పని చేస్తుందని, తాము మాత్రం అందరికోసం ఉన్నామంటూ, బిజెపి నినాదం ‘సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్’ను ప్రస్తావిస్తూ చెప్పారు.
‘డబ్బు తీసుకోండి..సైకిల్‌కు ఓటేయండి’
ఇతర పార్టీలు ఇచ్చే డబ్బు తీసుకుని తమ పార్టీకే ఓటు వేయమని ఓటర్లను కోరే రాజకీయ నాయకుల జాబితాలో ఇప్పుడు అఖిలేశ్ యాదవ్ కూడా చేరారు. శనివారం భదోహిలో జరిగిన ఒక ఎన్నికల సభలో అఖిలేశ్ మాట్లాడుతూ, ‘కొన్ని పార్టీలు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నట్లు నాకు తెలిసింది. మీరు ఆ డబ్బులు తీసుకుని సైకిల్‌కు ఓటేయమనేది నా సలహా’ అని అన్నారు. గత నెల గోవాలో మనోహర్ పారికర్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు ఆయనకు ఎన్నికల కమిషన్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే.