జాతీయ వార్తలు

బస్తర్‌లో ఏం జరుగుతోంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, మార్చి 4: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బస్తర్ దండకారణ్య ప్రాంతం మావోయిస్టులకు కంచుకోట. అయితే రెండేళ్లుగా మావోయిస్టుల దూకుడుకు పోలీసులు చెక్ పెట్టారు. 2016 సంవత్సరంలో జరిగిన ఎన్‌కౌంటర్లలోనైతే ఏకంగా 120 మందికి పైగా మావోయిస్టులు, వారి సానుభూతిపరులు చనిపోయారు. ఇది ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర చరిత్రలోనే రికార్డు. కాగా గడిచిన రెండు నెలలుగా పోలీసుల దూకుడుకు అడ్డుకట్ట పడింది. తిరిగి మావోయిస్టులు పైచేయి సాధిస్తున్నారు. అందుకు ఉదాహరణలు ఇటీవల జరిగిన మందుపాతరల పేలుళ్లు, అంబుష్‌ల్లో పోలీసుల మరణాలు. ఈ నేపథ్యంలో అసలు బస్తర్‌లో ఏం జరుగుతోంది..? అనే దానిపై చర్చకు తెరలేచింది. అగ్నికి ఆజ్యం పోసినట్లు శుక్రవారం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం బస్తర్ దండకారణ్య ప్రాంతంలోని పలువురు ఐపిఎస్‌లపై బదిలీ వేటు వేసింది. అంతకు ముందే రెండు నెలల క్రితం బస్తర్ ఐజీ కల్లూరిని దీర్ఘకాలిక సెలవుపై వెళ్లాలని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఆదేశించింది. నూతనంగా మరో ఐజీని కూడా నియమించింది. దీర్ఘకాలిక బదిలీలో ఉన్న ఐజీ కల్లూరి శనివారం వాట్సాప్ గ్రూప్‌లో తన ఫోటోతో పాటు, బదిలీ అయిన సుక్మా ఎస్పీ ఎలిశాల, బస్తర్ ఎస్పీ ఆర్‌ఎన్ దాస్ ఫోటోలు పెట్టి త్రీ ఇడియట్స్ క్లీన్‌బౌల్డ్ అని మెసేజ్ పెట్టారు. ప్రభుత్వం తీసుకున్న బదిలీల నిర్ణయంపై గుర్రుగా ఉన్న ఐపిఎస్ అధికారుల తీరుకు ఇది ప్రత్యక్ష సాక్ష్యంగా పేర్కొంటున్నారు. ఇక బస్తర్ దండకారణ్య ప్రాంతంలో మానవ హక్కులు ఉల్లంఘనకు గురవుతున్నాయని మానవ హక్కుల సంఘాలు గగ్గోలు పెట్టాయి. దండకారణ్యంలో గత సంవత్సరం జరిగిన ఎన్‌కౌంటర్లలో 120 మందికి పైగా మరణించారు. అయితే ఈ ఎన్‌కౌంటర్లన్నీ పచ్చి బూటకమని మానవహక్కుల సంఘాలు ఆరోపించాయి. నిజనిర్ధారణకు వెళ్లిన హక్కుల నేతలను దండకారణ్యంలో పోలీసులు నిర్బంధించి జైలుకు పంపారు. దీనిపైనా న్యాయపోరాటం జరిగింది. 2016లో బస్తర్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్లలలో సామాన్యులే ఎక్కువగా అసువులు బాశారని, అమాయక గిరిజనులు, సానుభూతిపరుల పేరిట రాత్రి వేళల్లో గిరిజన గూడేలపై పడి పాశవికంగా హత్య చేశారని హక్కుల సంఘాలు ఆరోపించాయి. దేశ సర్వోన్నత న్యాయస్థానంలో హక్కుల సంఘాలు తమ గొంతుకను వినిపించాయి. సల్వాజుడుం తరహాలో కొనసాగుతున్న అగ్ని వంటి సంస్థలను అక్కడి ప్రభుత్వం రద్దు చేయడంతో పాటుగా ఎన్‌కౌంటర్లకు కారణమయ్యారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులపై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. అంతేకాకుండా ఇక ఎన్‌కౌంటర్లపై విచారణలు జరిపి బూటకపు ఎన్‌కౌంటర్లని తేలితే పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించడం కూడా జరిగింది.

చిత్రం..ఒకనాటి బస్తర్ ఐజి కల్లూరి పెట్టిన వాట్సాప్ మెసేజ్