జాతీయ వార్తలు

రాష్టప్రతి పాలనను రాజ్యసభ ఖండించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలనను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ నాయకులు ఈ అంశంపై రాజ్యసభలో చర్చించి, రాష్టప్రతి పాలనకు వ్యతిరేకంగా ఒక తీర్మానాన్ని ఆమోదించాలని కోరు తూ నోటీసు ఇచ్చారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని రద్దు చేసి ఉత్తరాఖండ్ అంశాన్ని చర్చకు చేపట్టాలని నోటీసులో కోరారు. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు గులానంబీ ఆజాద్, కాంగ్రెస్ పక్ష ఉప నాయకుడు ఆనంద్ శర్మ ఈ నోటీసులు ఇచ్చారు. ఉత్తరాఖండ్‌లో ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని ఈ నోటీసులో పేర్కొన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచడంతో పాటు అక్కడ రాష్టప్రతి పాలనను విధించడాన్ని ఖండిస్తూ సభలో తీర్మానం చేయాలని రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీకి రూల్ 267 కింద ఇచ్చిన నోటీసులో ఆనంద్ శర్మ కోరారు. ‘ఉత్తరాఖండ్‌లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిరపరచడాన్ని ఈ సభ గర్హిస్తోంది. రాజ్యాంగంలోని 356వ అధికరణ కింద ఉత్తరాఖండ్‌లో అక్రమంగా రాష్టప్రతి పాలనను విధించడాన్ని ఈ సభ తిరస్కరిస్తోంది’ అని శర్మ తన నోటీసులో పేర్కొన్నారు. ఉత్తరాఖండ్‌లో హరీశ్ రావత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసి, అక్కడ రాష్టప్రతి పాలనను విధించినప్పటి నుంచి నరేంద్ర మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో దాడికి దిగుతోంది. ఉత్తరాఖండ్‌లో, అంతకుముందు అరుణాచల్‌ప్రదేశ్‌లో రాష్టప్రతి పాలన విధించడాన్ని సమాఖ్య వ్యవస్థపై దాడిగా కాంగ్రెస్ అభివర్ణిస్తోంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడానికి పెద్ద సంఖ్యలో ప్రతిపక్షాలు తమతో కలిసి వస్తాయని భావిస్తోంది.