జాతీయ వార్తలు

అధికారం మాదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 6: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రోడ్ షోకు వారణాసిలో ప్రజలనుండి వచ్చిన స్పందన తమకు అధికారం తెచ్చిపెడుతుందని బిజెపి జాతీయ నాయకులు అంచనా వేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో అధికారంలోకి రావటంతోపాటు గోవాలో అధికారాన్ని నిలబెట్టుకుంటామని వారు చెబుతున్నారు. నరేంద్ర మోదీ మూడు రోజుల నుండి ఉత్తరప్రదేశ్‌లో చేసిన ప్రచారానికి ప్రజలు బాగా స్పందించటంతోపాటు బిజెపికి అనుకూలంగా ఓటు వేయనున్నారని వారు అంచనా వేస్తున్నారు. శాసనసభకు జరిగిన ఒకటి, రెండో దశతో పోలిస్తే ఆఖరు మూడు దశల్లో బిజెపిపట్ల ప్రజల స్పందన ఎంతో బాగున్నదని వారు చెబుతున్నారు. వారణాసి రోడ్‌షోలు, సభలు, సమావేశాలకు ప్రజలనుండి మంచి స్పందన వచ్చింది, ఇది ఎన్‌డిఏ ప్రభుత్వం పట్ల విశ్వాసాన్ని ప్రకటించటమేనని వారు వాదిస్తున్నారు. వారణాసిలో నరేంద్ర మోదీ రోడ్ షో నిర్వహించిన రోజే రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా రోడ్ షో నిర్వహించారు. మోదీ రోడ్ షోతో పోలిస్తే వీరి రోడ్ షోకు ప్రజల నుండి పెద్దగా స్పందిన రాలేదని బిజెపి నేతలు వాదిస్తున్నారు. యాదవులంతా సమాజ్‌వాదీ పార్టీకి ఓటు వేశారు, ఇదే పద్ధతిలో యాదవేతర వెనుకబడిన కులాల వారంతా బిజెపికి ఓటు వేశారని వారు చెబుతున్నారు. ఎస్‌సిలు మాయావతికి పూర్తి మద్దతు ప్రకటించారు, ఇక ముస్లింలు ఏ ఒక్క పార్టీకి పూర్తి మద్దతు ఇవ్వలేదని చెబుతున్నారు. త్రిపుల్ తలాఖ్‌ను రద్దు చేస్తామని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీకి ముస్లిం మహిళల నుండి మంచి స్పందన వచ్చిందని, వారంతా బిజెపికే ఓటేస్తారని ఆశిస్తున్నారు. మెజారిటీ ముస్లింలు బిఎస్‌పికి ఓటు వేసి ఉంటారని వారు భావిస్తున్నారు. అయితే బిఎస్‌పి, ఎస్‌పి ప్రభుత్వాలతో విసిగిపోయిన రాష్ట్ర ప్రజలు ఈసారి బిజెపిని గెలిపించడం ఖాయమని వారు అంటున్నారు. బడుగు, బలహీన వర్గాలు, బీద ప్రజలు పెద్దనోట్ల రద్దును పూర్తిగా సమర్థించారు. దీనివలన కూడా బిజెపికి ప్రయోజనం కలుగుతుందని అంచనా. ఉత్తరప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చేందుకు బిజెపి తమ శక్తినంతా ప్రయోగించింది. మరోవైపు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కూడా బిజెపి విజయానికి కృషి చేసింది. నరేంద్ర మోదీ రాష్ట్భ్రావృద్ధి విషయంలో చేసిన ప్రసంగాలు ప్రజలను బాగా అకట్టుకున్నాయని అంటున్నారు.

చిత్రం..వారణాసిలోని రామ్‌నగర్‌లో సోమవారం నరేంద్ర మోదీ ర్యాలీకి తరలివచ్చిన జనం