జాతీయ వార్తలు

ప్రొ.సాయిబాబాకు యావజ్జీవ శిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గడ్చిరోలి, మార్చి 7: మావోయిస్టులతో సంబంధాలున్నట్టు నిర్ధారణ కావడంతో ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబాకు కోర్టు యావజ్జీవ జైలు శిక్ష విధించింది. మరో ఐదుగురికి జైలుశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. సాయిబాబా ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై గతంలోనే ప్రొఫెసర్‌ను అరెస్టు చేశారు. అయితే ఆరోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీం కోర్టు 2016 ఏప్రిల్‌లో సాయిబాబాకు బెయిల్ మంజూరు చేసింది. ఆరుగురు నిందితులు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని అభియోగం. భారతీయ శిక్షాస్మృతిలోని 120 బి చట్టం కింద సెక్షన్ 13, 18, 20, 38, 39లో ఆరుగురు నిందితులపై కేసులు నమోదు చేశారు. ప్రొఫెసర్ సాయిబాబాతోపాటు జెఎన్‌యు విద్యార్థి హేం మిశ్రా, మాజీ పాత్రికేయుడు ప్రశాంత్ రహీ, మహేష్ తిర్కే, పాండు నరొటే, విజయ్ తిర్కేలకు సెషన్స్ కోర్టు జైలు శిక్ష విధించింది. సాయిబాబా మరో నలుగురికి జీవిత ఖైదు విధించి, విజయ్‌కు పదేళ్ల శిక్ష వేసింది. అనారోగ్య కారణాలు చూపి బెయిల్‌పై ఉన్న సాయిబాబా దేశ, విదేశాల్లో అనేక సదస్సులు, సమావేశాలకు హాజరై మావోయిస్టు సిద్ధాంతాల ప్రచారం చేశారని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి సతియానాథన్ కోర్టుకు తెలిపారు. దివ్యాంగుడైన ప్రొఫెసర్ ప్రవర్తనలో ఎలాంటి మార్పూలేదని ఆరోపించారు. నిందితులందరీకి జీవిత ఖైదు విధించాలని ప్రాసిక్యూటర్ డిమాండ్ చేశారు. 2013 ఆగస్టులో గడ్ఛిరోలి జిల్లా అహేరిలో మహేష్ తిర్కే, పాండు నరొటే, హేం తిర్కేలను పోలీసులు అరెస్టు చేశారు. తరువాత ప్రశాంత్ రాయ్, విజయ్ తిర్కేలను గోండి జిల్లా డియోరిలో అరెస్టు చేశారు. దివ్యాంగుడైన సాయిబాబా వీల్‌చైర్‌పైనే ఉంటారు. మావోయిస్టు సిద్ధాంతాలు ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలపై 2014 మేనెలలో అరెస్టు చేశారు.