జాతీయ వార్తలు

10 వేల ఎల్‌పిజి పంపిణీదారుల నియామకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలియా(యూపి), ఏప్రిల్ 23: ఈ ఆర్థిక సంవత్సరం 10వేల మంది ఎల్‌పిజి పంపిణీదారులను నియమించనున్నట్టు కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ‘దేశంలో ప్రస్తుతం 18వేల పంపిణీ దారులున్నారు.
వచ్చే మూడు నెలల్లో కొత్తగా రెండువేల మంది డిస్ట్రిబ్యూటర్లను నియమిస్తాం. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి మరో ఎనిమిది వేల మందిని నియమిస్తాం’అని శనివారం ఇక్కడ తెలిపారు. ఉజ్వల్ యోజన పథకం ప్రారంభించడానికి వచ్చేనెల 1న ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడకు రానున్నందున ఆ ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు పెట్రోలియం మంత్రి ఇక్కడకు వచ్చారు.
ఉజ్వల్ యోజన పథకం కింద దారిద్య్రరేఖ రేఖ దిగువనున్న ఐదు లక్షల మందికి ఎల్‌పిజి కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రధాన్ స్పష్టం చేశారు.
ఎనిమిదివేల కోట్ల ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన పథకం మోదీ ప్రారంభించనున్నారు. దేశంలో 61 శాతం గృహాలకు ఎల్‌పిజి కనెక్షన్లు ఉన్నాయని మంత్రి తెలిపారు. యూపీలో 53 శాతం గృహాలకు ఎల్‌పిజి కనెక్షన్ ఉన్నట్టు పెట్రోలియం మంత్రి పేర్కొన్నారు. రిఫైనరీలు, మిగతా మార్గాల ద్వారా ఎల్‌పిజి ఉత్పత్తిని పెంచి సాధ్యమైనంత మంది వినియోగదారులకు కనెక్షన్లు ఇవ్వాలని యోచిస్తున్నట్టు ఆయన చెప్పారు.