జాతీయ వార్తలు

మారుతీ సుజుకీ కేసులో 31 మంది దోషులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుర్గావ్, మార్చి 10: హర్యానాలోని మనేసార్ మారుతీ సుజుకీ ప్లాంట్‌లో జరిగిన విధ్వంసం కేసులో గుర్గావ్ జిల్లా కోర్టు శుక్రవారం తీర్పును వెలువరించింది. ఈ హింసాత్మక సంఘటనకు సంబంధించి 31 మందిని దోషులుగా కోర్టు తీర్పునిచ్చింది. 117 మందిని నిర్దోషులుగా విడుదల చేస్తూ అడిషనల్ డిస్ట్రిక్ట్, సెషన్స్ జడ్జి ఆర్‌పి గోయల్ ఆదేశించారు. హత్య కేసులో 13 మందిని, దాడి కేసులో 18 మందిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. వీరందరికీ ఈనెల 17న శిక్షలు ఖరారు చేస్తారు. కోర్టు తీర్పు వెలువరించిన వెంటనే 22 మంది ముద్దాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టు తీర్పు దృష్ట్యా జిల్లా కోర్టు పరిసరాల్లో, మనేసర్ మారుతీ ప్లాంట్ వద్ద 144వ సెక్షన్ విధించారు. వందలాది మంది కార్మికులు కోర్టు వద్దకు తరలివచ్చారు. 2012 జూలై 18న మారుతీ ప్లాంట్‌లో జరిగిన హింసాత్మక ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ప్లాంట్ జనరల్ మేనేజర్(హెచ్‌ఆర్) అవనీష్ కుమార్ మంటల్లో తీవ్రంగా గాయపడి చనిపోయారు. మారుతీ సుజుకీకి చెందిన పలువురు ఎగ్జిక్యూటీవ్‌లు గాయపడ్డారు. హింసకు సంబంధించి 148 మంది కార్మికులను అరెస్టు చేశారు. ఈ కేసును ట్రయల్ కోర్టు విచారించింది. కాగా సెషన్స్ కోర్టు తీర్పుపై కార్మికులు మండిపడ్డారు. దీన్ని హైకోర్టులో సవాల్ చేస్తామని వారి తరపున్యాయవాది రాజేందర్ పాథక్ వెల్లడించారు. గుర్గావ్ కోర్టు విచారణ సందర్భంగా ఇక్బాల్ అనే కార్మికుడు మినహా మిగిలిన 147 మంది హాజరయ్యారు.జనరల్ మేనేజర్ హత్య పథకం ప్రకారం జరిగిందని కార్మికులకు ఎలాంటి సంబంధం లేదని పాథక్ చెప్పారు. ఇలా ఉండగా ఈ కేసులో ఎనిమిది మంది కార్మికులు ఇప్పటికే జైలులో ఉండగా మిగతావారు బెయిల్‌పై బయట ఉన్నారు. వివిధ డిమాండ్లపై కార్మికులు, యాజమాన్యం మధ్య తలెత్తిన వివాదం హింసాత్మకంగా మారింది. భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోడానికి కార్మిక యూనియన్లన్నీ కమల నెహ్రూ పార్క్‌లో సమావేశమయ్యాయి. హింసాత్మక సంఘటనతో కార్మికులకు ఎలాంటి సంబంధం లేదని మజ్దూర్ సహయోగ్ కేంద్ర ప్రధాన కార్యదర్శి ఖుషీరాం చెప్పారు. ఈ సంఘటన తరువాత 546 మంది పర్మినెంట్ ఉద్యోగులను తొలగించారని ఆయన అన్నారు. సెషన్స్ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తామని ఆయన అన్నారు.