జాతీయ వార్తలు

పాక్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 10: పాకిస్తాన్‌ను ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశంగా ప్రకటించాలని కోరే కఠిన పదజాలంతో కూడిన ఒక బిల్లును అమెరికా కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టినట్లు శుక్రవారం ఓ పత్రికా కథనం పేర్కొంది. ‘పాకిస్తాన్ స్టేట్ స్పాన్సర్ ఆఫ్ టెర్రిరజం యాక్ట్ ఆఫ్ 2015’ పేరుతో ఉండే ఈ బిల్లును ఉగ్రవాదంపై పార్లమెంటు ఉపసంఘానికి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ సభ్యుడు టెడ్ పో గురువారం ప్రవేశపెట్టినట్లు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పత్రిక కథనం పేర్కొంది. ‘ పాకిస్తాన్ నమ్మదగని మిత్ర దేశమే కాకుండా చాలా సంవత్సరాలుగా అమెరికాకు శత్రువులైన వారికి సాయం అందించడంతో పాటు ప్రోత్సహిస్తోంది’ అని పో ఆ బిల్లులో వ్యాఖ్యానించినట్లు ఆ కథనం పేర్కొంది. ఒసామా బిన్ లాడెన్‌కు ఆశ్రయం కల్పించడం మొదలుకొని అంతర్జాతీయ ఉగ్రవాద ముఠా హక్కానీ నెట్‌వర్క్‌తో అంటకాగడం దాకా ఉగ్రవాదంపై పోరులో పాకిస్తాన్ ఏ పక్షాన ఉందో చెప్పడానికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయన్నారు. అమెరికా పక్షాన మాత్రం కాదని చాలా స్పష్టంగా తెలుస్తోందన్న పో, అందువల్ల పాకిస్తాన్ చేసిన నమ్మకద్రోహానికి దానికి సహాయం చేయడాన్ని నిలిపివేయడంతో పాటుగా దాన్ని ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశంగా ప్రకటించాల్సిన సమయం వచ్చిందని అన్నారు.
అంతర్జాతీయ ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు ఇచ్చిందో లేదో అమెరికా అధ్యక్షుడు మూడు నెలల్లోగా ఒక నివేదికను జారీ చేయాలని ఆ బిల్లు నిర్దేశిస్తోంది. దాని తర్వాత పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశమనో, అలా కాని పక్షంలో తన వాదనను సమర్థిస్తూ సాక్ష్యాధారాలతో వివరణాత్మకంగా విదేశాంగ మంత్రి ఫాలోఅప్ నివేదికను కాంగ్రెస్‌కు సమర్పించాల్సి ఉంటుంది.