జాతీయ వార్తలు

హాజీ అలీ దర్గాలో అడుగుపెడితే చెప్పులతో కొడ్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 23: భూమాత బ్రిగేడ్ అధ్యక్షురాలు తృప్తీ దేశాయ్ గనుక హాజీ అలీ దర్గాకు యాత్ర చేపడితే ఆమెకు చెప్పులతో స్వాగతం పలుకుతామని స్థానిక శివసేన నాయకుడొకరు చేసిన ప్రకటన వివాదానికి కారణమైంది. అయితే స్ర్తిపురుష సమానత్వం కోసం పారాడుతున్న తృప్తీ దేశాయ్ మాత్రం తాను ఈ నెల 28న యథాప్రకారం హాజి అలీ దర్గా యాత్ర చేపడతానని స్పష్టం చేశారు. అయితే అరాఫత్ షేక్ చేసిన వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని శివసేన అదినాయకత్వం ప్రకటించడమే కాక, ఒక ప్రార్థనా మందిరంలోకి ప్రవేశించడానికి స్ర్తి పురుషులిద్దరికీ సమాన హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. ‘తృప్తీ దేశాయ్ గనుక హాజీ అలీ దర్గాలోకి ప్రవేశించడం గురించి మాట్లాడితే ఆమెకు చెప్పుల ‘ప్రసాదం’తో స్వాగతం పలకడం జరుగుతుంది. ఆరునూరయినా సరే ఆమెను దర్గాలోకి అడుగుపెట్టనివ్వం’ అని అరాఫత్ షేక్ విలేఖరులతో అన్నారు. అయితే షేక్ వ్యక్తిగత హోదాలో ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని, అది పార్టీ అధికార వైఖరి కాదని సేన అధికార ప్రతినిధి నీలమ్ గోరే అన్నారు. అంతేకాదు హైకోర్టు ఒక తీర్పు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం, పోలీసులు దాన్ని అమలు చేయాల్సిందేనని, అందువల్ల ఏ మహిళను కూడా ఏ మత సంస్థలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడం సరికాదని ఆమె అన్నారు. కాగా, షేక్ బెదరింపును తృప్తీ దేశాయ్ తేలిగ్గా తీసుకుంటూ, ఎలాంటి బెదిరింపూ తనపై పని చేయదని అన్నారు.