జాతీయ వార్తలు

ప్రైవేటు బిల్లుల జోరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 10: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగు ఎంపీలు శుక్రవారం లోక్‌సభ, రాజ్యసభలో పదకొండు ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రతిపాదించి చరిత్ర సృష్టించారు. తెలుగు ఎంపీ లు లోక్‌సభలో ఏడు ప్రైవేట్ మెంబర్ బిల్లులను ప్రతిపాదిస్తే రాజ్యసభలో నాలుగు ప్రైవేట్ మెంబర్ బిల్లులను ప్రతిపాదించారు. లోక్‌సభలో టిఆర్‌ఎస్ ఎంపీ బి.వినోద్‌కుమార్ రెండు ప్రైవేట్ మెంబర్ బిల్లులను ప్రతిపాదించారు. అనాథ పిల్లలకు సామాజిక భద్రత కల్పించటంతోపాటు సంక్షేమ చర్యలు తీసుకోవాలంటూ అనాథ పిల్లల సంక్షేమ చట్టానికి సవరణ ప్రతిపాదించారు. హైకోర్టు మరణశిక్ష విధిస్తే సుప్రీం కోర్టులో అప్పీల్ చేసుకునేందుకు వీలు గా రాజ్యాంగాన్ని సవరించాలంటూ వినోద్‌కుమార్ రెండో ప్రైవేట్ మెంబర్ బిల్లును లోక్‌సభలో ప్రతిపాదించారు. హైకోర్టు ఇచ్చే ప్రతి తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు ప్రస్తుతం వీలున్నది, అయితే మరణశిక్ష విషయంలో హైకోర్టు అనుమతి ఇస్తేనే సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు వీలున్నది, దీని వలన శిక్ష పడిన వారికి అన్యాయం జరుగుతోందని వినోద్‌కుమార్ తన ప్రైవేట్ మెంబర్ బిల్లులో వాదించారు. అందుకే హైకోర్టు మరణశిక్ష విధించే పక్షంలో దీనిపై సుప్రీం కోర్టులో అప్పీల్ చేసుకునేందుకు వీలు కల్పిస్తూ రాజ్యాంగాన్ని సవరించాలని ఆయన తన బిల్లులో ప్రతిపాదించారు.
ఆంధ్రప్రదేశ్‌కు పదిహేను సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇవ్వటంతోపాటు ఎఫ్.ఆర్.బి.ఎంను ఐదు శాతానికి పెంచాలి, రాష్ట్భ్రావృద్ధికి ప్రత్యేక రాయితీలు ఇచ్చేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని సవరించాలంటూ వైఎస్‌ఆర్ సిపి సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డి ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లును ఈరోజు ప్రతిపాదించారు. తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ లోక్‌సభలో ఈరోజు రెండు ప్రైవేట్ మెంబర్ బిల్లులను ప్రతిపాదించారు. జంతు హింస నిరోధక చట్టాన్ని సవరించాలన్నది మొదటి ప్రైవేట్ మెంబర్ బిల్లు కాగా, నైపుణ్య అభివృద్ధిని విద్యా హక్కు చట్టం పరిధిలోకి తీసుకు రావాలన్నది రెండో ప్రైవేట్ మెంబర్ బిల్లు. జంతు హింస నిరోధక చట్టంలోని లొసుగులను దుర్వినియో గం చేయటం ద్వారా పలువురు జంతు హింసకులు తప్పించుకుంటున్నారు కాబట్టి ఈ లోపాలను సరిదిద్దేందుకు ఈ చట్టాన్ని సవరించాలని జయదేవ్ డిమాండ్ చేశారు. దేశాన్ని నైపుణ్య ఇండియాగా తీర్చిదిద్దాలన్న ప్రధాని మోదీ కల నెరవేరాలంటే నైపుణ్య అభివృద్ధిని విద్యా హక్కు చట్టం పరిధిలోకి తీసుకురావాలి, దీని కోసం విద్యా చట్టాన్ని సవరించాలంటూ ఆయన ప్రైవేట్ మెంబర్ సవరణ బిల్లును ప్రతిపాదించారు. లక్షలాది మంది యువకులు డిగ్రీలు పూర్తి చేసుకుని బైటికి వస్తున్నా ఉపాధి కల్పించలేకపోతున్నాం, నైపుణ్యాభివృద్ధిని వి ద్యా హక్కు పరిధిలోకి తెస్తే ఉపాధి అవకాశాలు బాగా పెరుగుతాయని ఆయన తన రెండో ప్రైవేట్ మెంబర్ బిల్లులో అభిప్రాయపడ్డారు.
లోక్‌సభలో టిఆర్‌ఎస్ పక్షం నాయకుడు ఏ.పి.జితేందర్ రెడ్డి కూడా ఈరోజు రెండు ప్రైవేట్ మెంబర్ బిల్లులను ప్రతిపాదించారు. భారత అటవీ చట్టాన్ని సవరించాలన్నది మొదటి ప్రైవేట్ మెంబర్ బిల్లు కాగా, అఖిల భారత సర్వీసుల చట్టాన్ని సవరించాలన్నది రెండో సవరణ బిల్లు. రాజ్యసభలో కాంగ్రెస్‌కు చెందిన తెలుగు ఎంపీలు టి.సుబ్బిరామిరెడ్డి రెం డు ప్రైవేట్ మెంబరు బిల్లులను ప్రతిపాదిస్తే పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, కె.వి. పి.రామచంద్రరావు చెరొక ప్రైవేట్ మెంబర్ బిల్లులను ప్రతిపాదించారు.
ఆంధ్రప్రదేశ్‌కు అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తోపాటు అప్పటి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలకు రాజ్యాంగపరమైన హామీ ఇచ్చేందుకు వీలుగా ఏపీ విభజన చట్టాన్ని సవరించాలంటూ రామచందర్ రావు ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రతిపాదించారు.
సర్రోగేట్ ప్రకటనలను నిషేధించేందుకు వీలుగా చట్టాన్ని సవరించాలంటూ సుబ్బారామిరెడ్డి ఒక ప్రైవేట్ మెంబర్ సవరణ బిల్లును ప్రతిపాదించారు. బాల, బాలికలకు ఉచిత నిర్భంద విద్యను బోధించేందుకు చట్టాన్ని సవరించాలంటూ ఆయన రెండో ప్రైవేట్ మెంబర్ సవరణ బిల్లును ప్రతిపాదించారు. రాజ్యాంగంలోని పదవ షెడ్యూలును సవరించాలంటూ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఒక రాజ్యాంగ ప్రైవేట్ మెంబర్ సవరణ బిల్లును ప్రతిపాదించారు.

చిత్రాలు.. టి.సుబ్బిరామిరెడ్డి , బి.వినోద్‌కుమార్, పాల్వాయ గోవర్ధన్‌రెడ్డి-కెవిపి రాంచంద్రరావు