జాతీయ వార్తలు

గోవాలో గెలుపెవరిది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజీ, మార్చి 10: గోవా శాసనసభ ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో బిజెపి మళ్లీ విజయం సాధించి అధికారాన్ని నిలబెట్టుకుంటుందా? ఒకవేళ అలా జరిగితే రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ సొంత రాష్ట్రానికి తిరిగివచ్చి మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారా? అనే ప్రశ్నలు సర్వత్రా ఆసక్తిని కలిగిస్తున్నాయి. మొత్తం 40 స్థానాలున్న గోవా శాసనసభకు గత నెల 4వ తేదీన జరిగిన ఎన్నికల్లో గణనీయంగా 83 శాతం పోలింగ్ నమోదైన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో అధికార బిజెపికి, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీకి మధ్యే ప్రధాన పోటీ జరిగినప్పటికీ ఈసారి ఆ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కూడా మెజార్టీ స్థానాలకు పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో 36 నియోజకవర్గాల నుంచి తమ అభ్యర్థులను బరిలోకి దింపిన బిజెపి, మిగిలిన నాలుగు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులకు మద్దతు తెలిపింది. ఈ ఎన్నికల్లో బిజెపి ప్రచార పర్వానికి పారికర్ సారథ్యం వహించిన విషయం విదితమే. దీంతో రాష్ట్రంలో బిజెపి అధికారాన్ని నిలబెట్టుకుంటే ముఖ్యమంత్రిగా పారిక్కర్‌ను ఎంపిక చేయవచ్చన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ పదవి కోసం బిజెపి నుంచి పారిక్కర్‌తో పాటు ప్రస్తుత ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ కూడా రేసులో ఉన్నారు.
కాగా, రాష్ట్రంలో 37 స్థానాలకు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ, రెండు స్థానాల్లో స్థానాల్లో యునైటెడ్ గోవా, గోవా ఫార్వర్డ్ అభ్యర్థులకు, మరో స్థానంలో స్వతంత్ర అభ్యర్థికి మద్దతు తెలిపింది. అలాగే శనివారం వెలువడనున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎంజిపి (మహారాష్టవ్రాదీ గోమంతక్ పార్టీ), జిఎస్‌ఎం (గోవా సురక్షా మంచ్), శివసేన కూటమి భవితవ్యాన్ని కూడా తేల్చనున్నాయి.