జాతీయ వార్తలు

చంద్రయాన్-1 ఆచూకీ లభ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 10: అదృశ్యమైన చంద్రయాన్-1 ఉపగ్రహం చంద్రుడి చుట్టూ తిరుగుతోందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తెలిపింది. భారత్ తొలి చంద్రమండల యాత్రగా పంపించిన ఈ ఉపగ్రహంతో సంబంధాలు ఇప్పటికే తెగిపోయాయి. అది ఎక్కడ ఉందనేది ఇప్పటి వరకు అంతుబట్టని విషయంగా మిగిలిపోయింది. అయితే నాసా శాస్తజ్ఞ్రులు కొత్త ఇంటర్‌ప్లానెటరి రాడార్ టెక్నలాజికల్ అప్లికేషన్‌తో చంద్రయాన్-1 ఉపగ్రహం ఆచూకీని కనుగొన్నారు. చంద్రయాన్-1తో పాటు చంద్రుడి చుట్టూ తిరుగుతున్న నాసాకు చెందిన లూనార్ రికన్నైసెన్స్ ఆర్బిటర్ (ఎల్‌ఆర్‌ఒ) ఆచూకీని కూడా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ కనుగొంది.
ఈ రెండు ఉపగ్రహాల ఆచూకీని తాము కనుగొన్నట్లు కాలిఫోర్నియాలోని పసడెనాలో గల నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ లేబొరేటరిలో రాడార్ సైంటిస్టు మెరీనా బ్రోజోవిక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. భూకక్ష్యలోని పనిచేయకుండా పోయిన ఉపగ్రహాలు, రోదసిలోని శిథిలాలను కనుగొనడం సాంకేతికంగా ఓ సవాలు అని, భూమి ఉపగ్రహమైన చంద్రుడి కక్ష్యలోని వాటిని కనుగొనడం మరింత క్లిష్టమని ఆయన పేర్కొన్నారు.