జాతీయ వార్తలు

ఆంధ్రకు సాయం ఎలా ఉంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 10: కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు శుక్రవారం పదిహేను మంది కేంద్ర మంత్రులతో సమావేశమై ఆంధ్రప్రదేశ్‌లో కేంద్రం అమలు చేయవలసిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్న తీరును సమీక్షించారు. వెంకయ్యనాయుడు అధ్యక్షతన పార్లమెంటు ఆవరణలోని ఆయన కార్యాలయంలో దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ సమీక్షా సమావేశానికి హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణ మంత్రి మనోహర్ పారికర్, రైల్వే మంత్రి సురేశ్ ప్రభు, మానవ వనరుల అభివృద్ధి మంత్రి ప్రకాశ్ జావడేకర్, వైద్య ఆరోగ్య మంత్రి జె.పి.నడ్డా, ఐటి, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, జలవనరుల మంత్రి ఉమాభారతి, జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్, వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్ తదితరులు హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు అశోక్‌గజపతిరాజు, సుజనా చౌదరి, టిడిపి ఎంపీలు, ఏపి బిజెపి అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు హరిబాబు, ఇతర బిజెపి ఎంపీలు ఈ సమావేశానికి హాజరయ్యారు.
సీట్ల పెంపునకు ప్రతిపాదనలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ శాసన సభల సీట్లను పెంచుతామంటూ రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీను అమలు చేయటం గురించి నేటి సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు వెంకయ్యనాయుడు కార్యాలయం సాయంత్రం విడుదలు చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. రెండు రాష్ట్రాల శాసన సభల సీట్లు పెంచేందుకు సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నామని, ఇది పూర్తి కాగానే కేంద్ర మంత్రివర్గం పరిశీలనకు పంపిస్తామని హోం శాఖ కార్యదర్శి చెప్పినట్లు ప్రకనటలో తెలిపారు. వెంకయ్యనాయుడు ఈ అంశంపై న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో కూడా చర్చించారు. ఐఎన్‌ఎస్ విరాట్‌ను పర్యాటక కేంద్రంగా మార్చటం గురించి ఆయన మనోహర్ పారికర్‌తో చర్చించారు. విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్‌ను ఏర్పాటు చేసేందుకు సంబంధించిన ప్రతిపాదన గురించి చర్చ జరిగినప్పుడు సురేశ్ ప్రభు జోక్యం చేసుకుని ఈ ప్రతిపాదన తీవ్ర పరిశీలనలో ఉన్నదన్నట్లు పత్రికా ప్రకటనలో తెలిపారు. ఏపికి ఇచ్చిన హామీలు, పథకాలను వీలున్నంత త్వరగా పూర్తి చేయాలని వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రులకు సూచించారు. కేంద్రం ఇది వరకే ఆమోదించిన పథకాలకు ఎక్కువ నిధులు కేటాయించాలని ఆయన మంత్రులను కోరారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న పథకాల గురించి కూడా సమీక్ష జరిగింది.