జాతీయ వార్తలు

యుపిలో బిజెపి విజయం రామమందిరానికి వేసిన ఓటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగపూర్, మార్చి 12: ఉత్తరప్రదేశ్‌లో బిజెపి సాధించిన ఘన విజయం అయోధ్యలో రామందిర నిర్మాణానికి అనుకూలంగా ప్రజలు ఇచ్చిన తీర్పుగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సిద్ధాంతకర్త ఎంజి వైద్య అభివర్ణించారు. బిజెపి మేనిఫెస్టోలో అయోధ్యలో రామమందిర నిర్మాణం ప్రస్తావన ఉందని, రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు దానికి ఆమోద్రముద్రగా భావించవచ్చని ఆదివారం పిటిఐతో మాట్లాడుతూ వైద్య అన్నారు. వివాదాస్పద స్థలంలో మందిరం ఉండేదని, తవ్వకాల్లో మందిరం అవశేషాలు సైతం బయల్పడ్డాయని అలహాబాద్ హైకోర్టు స్పష్టంగా పేర్కొందని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు గనుక ఈ వివాదాన్ని పరిష్కరించని పక్షంలో అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ఎన్డీఏ ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకురావాలని ఆయన అన్నారు. శనివారం ఒక న్యూస్ చానల్‌తో వైద్య మాట్లాడుతూ యుపిలో బిజెపి విజయం రామమందిర నిర్మాణానికి ప్రజలు తమ ఓట్ల ద్వారా మద్దతు తెలిపారనడానికి అద్దం పడుతుందని అన్నారు.