జాతీయ వార్తలు

యూపీలో గెలుపు వీరుల రికార్డులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, మార్చి 12: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అప్రతిహత విజయం సాధించగా, అత్యధిక మెజారిటీలు, అతితక్కువ మెజారిటీలతో విజయం సాధించిన ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీకి చెందినవారే ఉన్నారు. ఒక లక్ష ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపొందిన ఎమ్మెల్యేలు అయిదుగురు ఉండగా, గెలుపొందిన అభ్యర్థి ప్రత్యర్థిపై వెయ్యికన్నా తక్కువ మెజారిటీతో గెలుపొందిన స్థానాలు ఎనిమిది ఉన్నాయి. అత్యధిక మెజారిటీ సాహిబా బాద్ బిజెపి అభ్యర్థి సునీల్ కుమార్ శర్మ పేరిట నమోదయింది. ఆయన కాంగ్రెస్ ప్రత్యర్థి అమర్‌పాల్‌ను లక్షా 50 వేల 685 ఓట్ల తేడాతో ఓడించారు. 171 ఓట్ల అతి తక్కువ మెజారిటీ దొమరియా గంజ్‌లో నమోదయింది. ఇక్కడ బిజెపి అభ్యర్థి రాఘవేంద్ర ప్రతాప్‌సింగ్ బిఎస్పీకి చెందిన సాయియాద ఖటూన్‌పై గెలుపొందారు. లక్షకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందిన నియోజకవర్గాల్లో రథ్, నోయిడా, కుండా, మథుర కూడా ఉన్నాయి. రథ్‌లో బిజెపికి చెందిన మనీషా అనురాగి, కాంగ్రెస్‌కు చెందిన గయాదీన్ అనురాగిని లక్షా 4 వేల 643 ఓట్లతో ఓడించారు.
నోయిడా కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కుమారుడు పంకజ్ సింగ్ కూడా ఎస్పీకి చెందిన సునీల్ చౌదరిని 1,04,016 ఓట్ల తేడాతో ఓడించారు. కుండాలో రఘురాజ్ ప్రతాప్ సింగ్ అలియాస్ రాజు భయ్యా బిజెపికి చెందిన జానకీశరణ్‌ను 1,03,647 ఓట్ల తేడాతో గెలుపొందగా, మథురలో బిజెపికి చెందిన శ్రీకాంత్ శర్మ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ప్రదీప్ మాథుర్‌ను లక్షా 1161 ఓట్ల తేడాతో ఓడించారు.
కాగా, అతి తక్కువ మెజారిటీతో గెలుపొందిన వారిలో మీర్‌పూర్ బిజెపి అభ్యర్థి అవతార్ సింగ్ భదానా అగ్రస్థానంలో ఉన్నారు. ఆయన ఎస్పీకి చెందిన లియాఖత్ అలీపై కేవలం 193 ఓట్లతో గెలుపొందారు. మంత్‌లో బిఎస్పీకి చెందిన శ్యామ్ సుందర్ శర్మ ఆర్‌ఎల్‌డికి చెందిన యోగేశ్ చౌదరిపై కేవలం 432 ఓట్ల తేడాతో గెలుపొంది తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. స్రవస్థి నియోజకవర్గంలో బిజెపికి చెందిన రామ్ ఫెరాన్ ఎస్పీకి చెందిన మహమ్మద్ రంజాన్‌ను 445 ఓట్ల తేడాతో ఓడించగా, మోహన్‌లాల్‌గంజ్ నియోజకవర్గంలో ఎస్పీకి చెందిన అంబరీష్ సింగ్ పుష్కర్ బిఎస్పీకి చెందిన రామ్ బహదూర్‌పై 530 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ముహమ్మదాబాద్-గోహ్నా నియోజకవర్గంలో బిజెపికి చెందిన శ్రీరాం సోంకార్ బిఎస్పీకి చెందిన రాజేంద్ర కుమార్‌ను 538 ఓట్ల తేడాతో ఓడించారు. రాంపూర్ మణిహరన్ లో బిజెపికి చెందిన దేవేంద్ర కుమార్ నిమ్ బిఎస్పీకి చెందిన రవీంద్ర కుమార్ మొల్హుపై 595 ఓట్ల తేడాతో గెలుపొందగా, ముబారక్‌పూర్‌లో అదే పార్టీకి చెందిన దేవేంద్ర కుమార్ నిమ్ బిఎస్పీకి చెందిన రవీంద్ర కుమార్ మొల్హును 688 ఓట్ల తేడాతో ఓడించారు.