జాతీయ వార్తలు

శుష్క వాగ్దానాలతో ఓటర్లకు వల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా/ శ్యామ్‌పూర్, ఏప్రిల్ 23: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీల్లో ఉమ్మడిగా పోటీచేస్తున్న సిపిఎం, కాంగ్రెస్ పాలక పక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలకు పదునుపెట్టారు. శ్యామ్‌పూర్‌లో శనివారం ఎన్నికల సభలో మాట్లాడిన రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి మమతా బెనర్జీలు ప్రజలకు శుష్కవాగ్దానాలు చేస్తున్నారని ఆరోపించారు. గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలుచేయకుండా, మరోసారి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు విమర్శించారు. శనివారం ఇక్కడ సిపిఎం నాయకులతో కలిసి ఆయన ఎన్నికల సభలో పాల్గొన్నారు.‘మమతాజీ, మోదీజీ ఆచరణ సాధ్యంకాని హామీలు గుప్పిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లో 70 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని మమత చెబుతున్నారు. దేశంలో ఏకంగా రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని మోదీ హామీ ఇస్తున్నారు. ఓట్ల కోసమే ఇలాంటి శుష్కవాగ్దానాలు ఇస్తున్నారు’అని రాహుల్ ధ్వజమెత్తారు.
మమతా బెనర్జీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆయన విరుచుకుపడ్డారు. తృణమూల్ హ యాంలో ఎన్నో పరిశ్రమలు ఖాయిలాపడిపోయాయని రాహుల్ ఆరోపించారు. శారదా చిట్స్ కుంభకోణం కేసు అతీగతీ లేకుండా పోయిందని, నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు. కోల్‌కతా నడిబొడ్డులో ఇటీవల ఫ్లైఓవర్ కూలిపోయిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ మెటీరియల్ సరఫరా కాంట్రాక్టు తృణమూల్ పార్టీ నేతలకే అప్పగించారని ఆరోపించారు. నాసిరకం మెటీరియల్ వాడినందుకే ఫ్లైఓవర్ కూలిపోయిందని ఆయన అన్నారు. అవినీతి నిర్మూలన, ఉపాధి అవకాశాలపై మోదీ, మమతలు ఇస్తున్న హామీలను నమ్మవద్దని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు విజ్ఞప్తి చేశారు. విదేశాల్లోని నల్లధనం రప్పిస్తాన్న మోదీ పథకం ఫెయిర్ అండ్ లలీలా ఉందని ఆయన ఎద్దేవా చేశారు.‘పశ్చిమ బెంగాల్‌లో ఒకప్పుడు ఎన్నో పరిశ్రమలు ఉండేవి. మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక స్మశానంలా మారిపోయాయి’ అని ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈ ఎన్నికల్లో సిపిఎం, కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ఆయన అభ్యర్థించారు. తాము అధికారంలోకి వస్తే ఉద్యోగవకాశాలు కల్పించడంతోపాటు శారదా చిట్స్ నిందితులు, అవినీతి పరుల ఆటకట్టిస్తామని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు హామీ ఇచ్చారు. రాజధాని కోల్‌కతాలో శనివారం మీడియాతోమాట్లాడిన సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తృణముల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తరువాత ఏడుగురు సిపిఎం కార్యకర్తలను అధికార పార్టీ హత్యచేయించిందని ఆయన ఆరోపించారు. రాజకీయ ప్రత్యర్థులపై దాడులు చేయిస్తూ భీతావహవాతావరణం సృష్టిస్తున్నారని ఆయన ఆరో పించారు.
ప్రచారానికి తెర!
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ నాలుగోదశ పోలింగ్‌కు శనివారం సాయంత్రంతో ప్రచారం ముగిసింది. 49 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. మొత్తం 345 మంది అభ్యర్థుల బరిలో ఉన్నారు. ఉత్తర 24 పరగణాలు, హౌరా జిల్లాలో పోలింగ్ ఉంటుంది. 1.07 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 12,500 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరుగుతుందని ఎన్నికల అధికారులు వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి అమిత్ మిత్రా, జైలులో ఉన్న మాజీ మంత్రి మదన్ మిత్రా వంటి ప్రముఖులు నాలుగోవిడత పోలింగ్ జరిగే నియోజకవర్గాల నుంచి పోటీలో ఉన్నారు. ఫిక్కీ సెక్రెటరీ జనరల్ అమిత్ మిత్రా 2011 ఎన్నికల్లో రాజకీయాల్లోకి వచ్చారు.

చిత్రం శ్యామ్‌పూర్‌లో శనివారం ఎన్నికల సభలో మాట్లాడుతున్న రాహుల్ గాంధీ