జాతీయ వార్తలు

రక్షణ మంత్రిగా జైట్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పణజి, మార్చి 13: గోవాలో ముఖ్యమంత్రి పదవి చేపడుతున్న నేపథ్యంలో రక్షణమంత్రి మనోహర్ పారికర్ సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీకి రక్షణ మంత్రిత్వ శాఖను అదనంగా కేటాయిస్తూ రాష్టప్రతి భవన్ ఒక ప్రకటనను విడుదల చేసింది. ‘‘ప్రధానమంత్రి సలహా మేరకు కేబినెట్ మంత్రిగా ఉన్న అరుణ్‌జైట్లీకి రక్షణ మంత్రిత్వ శాఖను అదనంగా కేటాయించటం జరిగింది.’’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, తనకు సభలో తగినంత మెజార్టీ సభ్యుల మద్దతు ఉందని, ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతించాలంటూ గవర్నర్ మృదులాసిన్హాను పారికర్ ఆదివారమే కలిసి విజ్ఞప్తి చేశారు. పారికర్‌ను ఆమె ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించారు. దీంతో పారికర్ మంగళవారం సాయంత్రం 5గంటలకు గోవా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ‘‘నేను నా రాజీనామాను ప్రధాని కార్యాలయానికి పంపించాను. రేపు(మంగళవారం) కేబినెట్ మంత్రులతో పాటు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తాను. మంత్రుల సంఖ్య ఎంత ఉండాలి, శాఖల కేటాయింపు ఎలా జరగాలి అన్న అంశాలపై కసరత్తు జరుగుతోంది. దీనికి తుదిరూపు వచ్చిన తరువాత మీడియాకు తెలియజేస్తాం’’ అని పారికర్ పేర్కొన్నారు. 40 స్థానాలున్న గోవా అసెంబ్లీలో మెజారిటీకి అవసరమైన 21సీట్లను సాధించుకోలేకపోయిన బిజెపి ఎంజిపి, జిఎఫ్‌పిల మద్దతుతో 22మంది ఎమ్మెల్యేల మద్దతును సంపాదించింది. బిజెపికంటే ఎక్కువగా 17సీట్లతో అత్యధిక స్థానాలు గెలుచుకున్నప్పటికీ మెజార్టీకి అవసరమైన మరో నలుగురు ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టుకోవటంలో బిజెపి కంటే వెనుకబడిపోయింది. ఫలితాలు వెలువడిన క్షణం నుంచే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కలిసి పారికర్ వ్యూహాత్మకంగా పావులు కదిపారు. ఎంజిపి, జిఎఫ్‌పిలతో వారికి అవసరమైన అవగాహనకు రావటంలో ఎంతమాత్రం ఆలస్యం చేయలేదు. బేరసారాలు చేయలేదు. పారికర్‌ను మాత్రమే సిఎంగా అంగీకరిస్తామనగానే ఆయన వెంటనే ఒప్పుకుని రక్షణమంత్రి పదవికి రాజీనామా చేసేశారు. మంత్రి పదవుల పందేరంలోనూ స్పష్టతనిచ్చారు. దీంతో బిజెపి తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమమైంది. వాస్తవానికి గోవా ఎన్నికల ప్రచారం ప్రారంభమైన నాటి నుంచే పారికర్ బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థిగా విస్తృతంగా చర్చ జరిగింది. ఆయన కూడా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచీ ఎడతెరపి లేకుండా ప్రచారంలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తాను పాల్గొన్న ప్రచార సభలోనూ పారికర్ సామర్థ్యంపై ప్రశంసల వర్షమే కురిపించారు. 2014లో మోదీ అధికారంలోకి వచ్చిన సందర్భంలో గోవా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి కేంద్రంలో రక్షణ మంత్రిత్వ బాధ్యతలు చేపట్టిన పారికర్ సరిగ్గా 28నెలల తరువాత మళ్లీ సిఎంగా రాష్ట్రానికి తిరిగి వచ్చారు. గత రెండున్నరేళ్లలో తాను రక్షణ మంత్రిగా సమర్థంగా విధి నిర్వహణ చేశానని పారికర్ అన్నారు.