జాతీయ వార్తలు

మాల్యా సభ్యత్వం రద్దు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: దేశంలో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని బకాయిలు చెల్లించకుండా పారిపోయిన ‘కింగ్’్ఫషర్ కింగ్ విజయ్‌మాల్యా పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని సోమవారం విలువల కమిటీ సిఫారసు చేసింది. కరణ్‌సింగ్ నేతృత్వంలోని ఈ కమిటీ మాల్యాకు షోకాజ్ నోటీసు జారీ చేసిన వారం రోజుల తరువాత నిర్ణయం తీసుకుంది. దాదాపు రూ. 9400 కోట్లు రుణాలు బకాయిలతో పరారైన మాల్యా పాస్‌పోర్ట్‌ను కేంద్ర ప్రభుత్వం ఆదివారం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ‘మా షోకాజ్ నోటీసుకు మాల్యా ఇచ్చిన సమాధానంతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నుంచి అందిన సమాచారం, ముందస్తు బెయిలు లేని అరెస్టు వారంట్ వంటి అంశాలన్నీ పరిశీలించిన మీదట విదేశాంగ శాఖ మాల్యా పాస్‌పోర్ట్‌ను రద్దు చేయాలని నిర్ణయించింది’ అని ఆ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. దీని ఆధారంగా రాజ్యసభ విలువల కమిటీ మాల్యా పార్లమెంట్ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని సిఫారసు చేసింది.