జాతీయ వార్తలు

స్టెంట్ల ధర నియంత్రణతో ఏటా రూ.4,450కోట్లు ఆదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 14: స్టెంట్ల ధరను అదుపులోకి తీసుకురావడంతో దేశంలో రోగులకు సాలీనా దాదాపు 4,450 కోట్ల రూపాయలు మిగులుతాయని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు తెలియజేసింది. కరోనరీ స్టెంట్లను గత ఏడాది డిసెంబర్ 21వ తేదీన డిపిసిఓ 2013లోని షెడ్యూలు-1లో చేర్చడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 17వ తేదీన ఎన్‌పిపిఎ (నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ) వీటి ధరలను ఖరారు చేసిందని, దీంతో రోగులకు సాలీనా రూ.4,450 కోట్లు మిగులుతాయని కేంద్ర రసాయనాల శాఖ సహాయ మంత్రి మన్సుఖ్ ఎల్.మాండవీయ మంగళవారం లోక్‌సభకు లిఖతపూర్వకంగా తెలియజేశారు. హృద్రోగులకు ఉపయోగించే మెటల్ స్టెంట్ గరిష్ఠ ధరను 7,260 రూపాయలుగానూ, డ్రగ్-ఎల్యూటింగ్ స్టెంట్ గరిష్ఠ ధరను 29,600 రూపాయలుగానూ ఖరారు చేసినట్లు ఎన్‌పిపిఎ ఇటీవల తమ నోటిఫికేషన్‌లో స్పష్టం చేసిన విషయం విదితమే. ఈ నోటిఫికేషన్ జారీ కావడానికి ముందు దేశంలో వీటి సరాసరి గరిష్ఠ రిటైల్ ధరలు వరుసగా 45,100 రూపాయలు, 1.21 లక్షల రూపాయలుగా ఉన్నాయి. అయితే ఈ ధరలపై నియంత్రణ విధించడంతో మెటల్ స్టెంట్ ధర 74 శాతం, డ్రగ్-ఎల్యూటింగ్ స్టెంట్ ధర 85 శాతం చొప్పున తగ్గాయని మంత్రి వివరించారు.