జాతీయ వార్తలు

జయ మృతిపై సిబిఐ దర్యాప్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 14: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణం వెనక అనేక అనుమానాలున్నాయని దీనిపై సిబిఐ విచారణ జరిపించాలని అన్నాడిఎంకె సభ్యుడు పిఆర్ సుందరం లోక్‌సభలో డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గానికి చెందిన ఎంపీ మంగళవారం లోక్‌సభలో ఈ అంశాన్ని లెవనెత్తారు. దీనిపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంతకుమార్ బదులిస్తూ జయ మృతిపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దర్యాప్తునకు ఆదేశించిందని స్పష్టం చేశారు. జయలలిత చెన్నై అపోలో ఆసుపత్రిలో 75 రోజులు చికిత్స పొందారని, ఆమెను చూడడానికి ఎవర్నీ అనుమతించలేదని ఎంపీ సభ దృష్టికి తెచ్చారు. డిహైడ్రేషన్, జ్వరానికి చికిత్స చేస్తున్నామని చెప్పుకుంటూ వచ్చి వైద్యులు ఆకస్మాత్తుగా గుండెపోటు వచ్చిందని పేర్కొనడంపై అనేక అనుమానాలున్నాయని సుందరం తెలిపారు. అమ్మ అనుమానాస్పద మృతిపై సిబిఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఆకస్మిక మృతితో అంతా దిగ్భ్రాంతి చెందారని మంత్రి అన్నారు.