జాతీయ వార్తలు

ఇందిరా అవాస్ యోజన పేరు మారింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం మరో కేంద్ర పథకం పేరు మార్చాలని నిర్ణయించింది. ఇందిరా అవాస్ యోజన పథకం పేరు మార్పుచేశారు. ఇక నుంచి ఇందిరా అవాస్ యోజన పథకాన్ని ‘ప్రధాన మంత్రి గ్రామీణ అవాస్ యోజన’పథకంతో పిలుస్తారు. అలాగే ఇళ్ల నిర్మాణ పథకానికి నిధులు పెంచాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి ఈ పథకం కింద లబ్ధిదారులకు 70 వేలు మంజూరు చేయగా ఇప్పుడది 1.20 లక్షలకు పెంచారు. లబ్ధిదారులకు 70 వేల వరకూ రుణ సదుపాయం కల్పించేలా ప్రధాన మంత్రి గ్రామీణ అవాస్ యోజన పథకం మార్గదర్శకాలు మార్చారు. ఇళ్ల నిర్మాణంతో పాటు టాయిలెట్ నిర్మించుకోడానికి అదనంగా 12వేల రూపాయలు మంజూరు చేస్తారు.