జాతీయ వార్తలు

ఇక జాతీయ ట్రిబ్యునల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 14: రాష్ట్రాల మధ్య తలెత్తే జల వివాదాల పరిష్కారానికి జాతీయస్థాయి ట్రిబ్యునల్ ఏర్పాటుకు కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి ప్రతిపాదించారు. విడివిడిగా ఏర్పాటు చేస్తున్న తాత్కాలిక ట్రిబ్యునళ్లకు బదులు శాశ్వత ప్రాతిపదికన ట్రిబ్యునల్ ఏర్పాటుకు నదీ జలాల సవరణ బిల్లును మంగళవారం లోక్‌సభలో ప్రతిపాదించారు. ట్రిబ్యునల్‌కు అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ఆరుగురు సభ్యులు ఉంటారని ఉమాభారతి వివరించారు. ట్రిబ్యునల్ అధ్యక్షుడి పదవీ కాలపరిమితి ఐదేళ్లు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తిని ట్రిబ్యునల్ అధ్యక్షుడిగా నామినేట్ చేస్తారు. ఉపాధ్యక్షుడు, సభ్యులు తమకు కేటాయించిన రాష్ట్ర జల వివాదాలు పరిష్కారం అయ్యేంత వరకు పదవిలో కొనసాగుతారు. ట్రిబ్యునల్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, నామినేటెడ్ సభ్యులు 70 ఏళ్ల వయసు వచ్చే వరకూ పదవిలో కొనసాగేందుకు వీలుంటుంది. రెండు రాష్ట్రాల మధ్య తలెత్తే జల వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునల్ అధ్యక్షుడి సారథ్యంలో ముగ్గురు సభ్యులతో ఒక బెంచిని ఏర్పాటు చేస్తారు. ముగ్గురిలో సీనియర్ సభ్యుడు బెంచికి అధ్యక్షత వహిస్తారు. అయితే, ఈ బిల్లు ప్రతిపాదనను బీజూ జనతాదళ్ సీనియర్ నాయకుడు బర్తృహరి మహతామ్ తీవ్రంగా వ్యతిరేకించారు. బిల్లులో దోషాలున్నాయని, అధికారులు బిల్లును సక్రమంగా రూపొందించలేదంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. దోషాలతో కూడిన బిల్లును ప్రతిపాదించటం మంచిది కాదు కాబట్టి, ఉమాభారతి బిల్లును ఉపసంహరించుకోవాలని సూచించారు. పటిష్టమైన బిల్లుతో సభ ముందుకు రావటం మంచిదని సూచించారు.
‘నదీ జలాలు రాష్ట్ర జాబితాలోని అంశం. కనుక కేంద్రం మొదట బిల్లు గురించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించాలి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యక్తం చేసే అభిప్రాయాలను సైతం పరిగణనలోకి తీసుకున్న తరువాతే బిల్లు రూపొందించాలని బర్తృహరి మహతాబ్ వాదించారు. రాష్ట్ర జాబితాలోని అంశంపై కేంద్రం చట్టాన్ని ఎలా రూపొందిస్తుందని ఆయన ప్రశ్నించారు. అయితే ఉమాభారతి ఆయన వ్యక్తంచేసిన అభిప్రాయంతో ఏకీభవించలేదు. రాజ్యాంగంలోని 62 నిబంధన ప్రకారం నదీ జలాల అంశంపై చట్టంచేసే అధికారం కేంద్రానికి ఉన్నదని మంత్రి ఉమాభారతి స్పష్టం చేశారు. తమ రాష్ట్రం ఎదుర్కొంటున్న జల వివాదాలను పరిష్కరించేందుకు ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరుతున్న బర్తృహరి మహతాబ్, శాశ్వత ట్రిబ్యునల్ ఏర్పాటు బిల్లును వ్యతిరేకించటం అర్థంకావటం లేదని ఉమాభారతి చెప్పారు. వివిధ రాష్ట్రాల మధ్య తలెత్తే జల వివాదాలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేస్తోంది. అయితే ఇలాంటి ట్రిబ్యునళ్ల ఏర్పాటు ఖర్చుతో కూడిన పని కావటం వల్ల శాశ్వత ప్రాతిపదికపై ఒక ట్రిబ్యునల్ వ్యవస్థను ఏర్పాటు చేయటమే బిల్లు ప్రధాన లక్ష్యమని ఉమాభారతి వివరించారు. ఉమాభారతి వివరణ ఇచ్చిన అనంతరం బిల్లును చర్చకు ఆమోదించారు.