జాతీయ వార్తలు

విశాఖలో యుద్ధ విమాన మ్యూజియం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 14: భారత నౌకాదళ సేవల నుంచి వైదొలగిన ఐఎన్‌ఎస్ విరాట్‌ను విశాఖకు తీసుకురావాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నం ఫలించలేదు. అయితే, దీనికి ప్రతిగా ఓ యుద్ధ విమానాన్ని విశాఖకు తీసుకువస్తున్నారు. భారత నౌకాదళంలో సుమారు 30 ఏళ్ల పాటు సేవలందించి, ఈనెల 29న డి-కమిషన్ అవుతున్న టియు-142 యుద్ధ విమానాల్లో ఒకటి విశాఖకు రానుంది. భారత నౌకాదళంలో టియు-142 రకానికి చెందిన యాంటీ సబ్‌మెరైన్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఉన్నాయి. 1988లో ఈ యుద్ధ విమానాలు భారత నౌకాదళంలో చేరాయి. అంతకు ముందు నుంచి రష్యన్ నేవీలో విశేష సేవలందిస్తూ వచ్చాయి. ఈ విమానంలో నీటి అడుగున ఉంటే శత్రు దేశాల సబ్‌మెరైన్‌లను ధ్వంసం చేయగల సామర్థ్యం ఉన్న బాంబులు, టార్పిడోలు ఉంటాయి. సుమారు 6,500 కిలో మీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని కూడా చేధిచంగల సామర్థ్యం ఈ యుద్ధ విమానాలకు ఉంది. టియు-142 భారత నౌకాదళంలో అత్యంత భారీ యుద్ధ విమానంగా ఇప్పటి వరకూ గుర్తింపు పొందింది. టియు-142కి చెందిన ఎనిమిది యుద్ధ విమానాల సేవలు ఈనెల 29తో ముగియనున్నాయి. వీటిస్థానే ఇప్పటికే భారత నౌకాదళం పి-8ఐ యుద్ధ విమానాలను అమెరికా నుంచి కొనుగోలు చేసి వినియోగిస్తోంది. టియు-142 యుద్ధ విమానాల డి కమిషనింగ్ తరువాత దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మ్యూజియంలుగా ఏర్పాటు చేయాలని రక్షణ శాఖ నిర్ణయించింది. ఇందులో తొలి విమానం విశాఖకు రాబోతోంది. ప్రస్తుతం తమిళనాడులోని అరక్కోణం వద్ద ఉన్న ఐఎన్‌ఎస్ రజాలి నేవీ ఎయిర్ స్టేషన్‌లో ఈ విమానాలు ఉన్నాయి. అక్కడి నుంచి ఒక విమానాన్ని విశాఖకు తీసుకురానున్నారు. ఈ విమానాన మ్యూజియంను బీచ్ రోడ్డులోని కురుసుర సబ్‌మెరైన్ మ్యూజియంకు ఎదురుగా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. స్థానిక అప్పుఘర్ వద్ద ఉన్న లుంబినిపార్క్, వుడా పార్క్ స్థలాలను కూడా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, వుడా వైస్ చైర్మన్ బాబూరావు నాయుడు తదితరులు మంగళవారం పరిశీలించారు. పర్యాటక శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ బుధవారం నగరానికి వస్తున్నారు. వీరు తయారు చేసిన నివేదికను ఆయన ముందుంచనున్నారు. ఈ మ్యూజియం ఏర్పాటుకు నాలుగు నుంచి ఆరు నెలల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

చిత్రాలు.. మ్యూజియం ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్ ప్రవీణ్‌కుమార్.
* టియు-142 యుద్ధ విమానం (కింది చిత్రం)