జాతీయ వార్తలు

లైన్‌క్లియర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 16: దేశవ్యాప్తంగా ఏకీకృత పన్నుల వ్యవస్థ జిఎస్‌టికి మరింతగా మార్గం సుగమమైంది. అత్యంత కీలకమైన రాష్ట్రాల వస్తు సేవల పన్ను (ఎస్‌జిఎస్‌టి), కేంద్ర పాలిత ప్రాంతాల వస్తుసేవల పన్ను (యుటిజిఎస్‌టి)కు సంబంధించిన అనుబంధ బిల్లుల్ని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సారధ్యంలోని జిఎస్‌టి మండలి గురువారం ఆమోదించింది. ఈ చారిత్రక పన్నుల వ్యవస్థ అమలుకు ఇవే చివరి రెండు కీలక బిల్లులు కావడం, వీటికీ ఆమోదం లభించడంతో జూలై 1న సరికొత్త పన్నుల సంస్కరణ విధానం అమలు దిశగా మరింత ముందుకెళ్లినట్టయింది. ఇంతకు ముందు జరిగిన కౌన్సిల్ భేటీలో ఐజిఎస్‌టి, సెంట్రల్ జిఎస్‌టి,నష్ట పరిహార చెల్లింపు బిల్లులకు ఆమోదం లభించిన విషయం తెలిసిందే. ఈ ఐదు బిల్లులూ అత్యంత కీలకమైనవి కావడంతో వాటిపై విస్తృతంగానే చర్చ జరిగింది. తాజా పరిణామం నేపథ్యంలో వీటిని కేబినెట్ ఆమోదానికి అనంతరం పార్లమెంట్ తుది ముద్రకు పంపుతారు. అప్పుడే జిఎస్‌టికి శాసన పరమైన దన్ను లభిస్తుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మరో రెండు కీలక చట్టాలను రూపొందించాల్సి ఉంటుందని జైట్లీ తెలిపారు. వీటిలో ఒకటి నిబంధనల రూపకల్పన అని పేర్కొన్న ఆయన ఇప్పటికే ఐదు నిబంధనలను ఆమోదించడం జరిగిందని చెప్పారు. వీటికి సంబంధించిన తుది ముసాయిదాల రూపకల్పన వచ్చే వారం పూర్తవుతుందని, ఈ నెల 31న జరిగే జిఎస్‌టి మండలి సమావేశంలో వీటిపై చర్చ జరుగుతుందన్నారు. 5,12,18,28శాతంతో కూడిన నాలుగు శ్లాబుల విధానాన్ని జిఎస్‌టి ఇప్పటికే ఆమోదించింది. లగ్జరీ వస్తువులు, పొగాకు వంటి వాటిపై అదనపు సెస్ విధిస్తారు. నాలుగు నుంచి ఐదు వరకూ ఉండే ఇలాంటి వాటిపై గరిష్ట స్థాయిలో 15శాతం సుంకం ఉంటుందని జైట్లీ చెప్పారు.

చిత్రం..ఢిల్లీలో జరిగిన జిఎస్‌టి కౌన్సిల్ సమావేశంలో ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ