జాతీయ వార్తలు

ఏపీలో రెండు కేంద్రీయ విద్యాలయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢీల్లీ, మార్చి16: ఆంధ్రప్రదేశ్‌లో ఒంగోలు, రాజాంపల్లిలలో కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో కేంద్రీయ విద్యాలయాలపై రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్రమంత్రి సమాధానం ఇస్తూ, దేశవ్యాప్తంగా 35 కేంద్రీయ విద్యాలయాలకు కేంద్రమంత్రి వర్గం ఆమోదం తెలిపిందని, అందులో ఏపీలో రెండు విద్యాలయాలను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. అలాగే కేంద్రీయ విద్యాలయాలలో ఖాళీగా ఉన్న పోస్టులపై ఎంపీ రాపోలు ఆనంద్‌కుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ, కేం ద్రీయ విద్యాలయాలలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులకు ఇప్పటికే పరీక్షను పూర్తి చేసామని, త్వరలోనే భర్తీ చేస్తామని ఆయన వెల్లడించారు.