జాతీయ వార్తలు

అడ్డదారిలో గద్దెనెక్కారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, మార్చి 16: గోవా, మణిపూర్‌లో అడ్డదారిన బిజెపి అధికారంలోకి వచ్చిందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. రెండు రాష్ట్రాల్లోనూ సొమ్ములు ఎరేసి ప్రజల అభిష్ఠానికి వ్యతిరేకంగా గద్దెనెక్కారని గురువారం ఇక్కడ విరుచుకుపడ్డారు. ‘గోవా, మణిపూర్‌లలో డబ్బులిచ్చి ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. బిజెపి చర్య అప్రజాస్వామికం. అనైతికం. రెండు రాష్ట్రాల్లోనూ అధికారంకోసం అడ్డదారులు తొక్కారు’ అని రాహుల్ అన్నారు. గోవాలో పారికర్ ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకురాగా పైవిధంగా స్పందించారు.
పంజాబ్ ముఖ్యమంత్రిగా కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు వచ్చిన రాహుల్ రాజ్‌భవన్ వద్ద మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌పై విశ్వాసం ఉంచి అధికారం అప్పగించిన పంజాబ్ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అమరీందర్ సింగ్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేసి పంజాబ్ అభివృద్ధికి పాటుపడుతుందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు.