జాతీయ వార్తలు

నెగ్గిన పారికర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజి, మార్చి 16: గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ గురువారం జరిగిన విశ్వాస పరీక్షలో సునాయాసంగా నెగ్గారు. ప్రత్యేకంగా సమావేశపరచిన శాసనసభలో పారికర్‌కు 22మంది సభ్యుల మద్దతు లభించింది. 40మంది సభ్యులున్న శాసన సభలో సాధారణ మెజార్టీకి 21మంది మద్దతుంటే సరిపోతుంది. కాగా, పారికర్‌కు వ్యతిరేకంగా 16 ఓట్లు మాత్రమే పడ్డాయి. చివరినిమిషంలో కాంగ్రెస్ సభ్యుడు విశ్వజిత్ రాణె ఓటింగ్‌కు గైర్హాజరై పార్టీకి షాక్ ఇచ్చారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ మెజార్టీ రాకపోవటం తెలిసిందే. కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, మెజార్టీకి నాలుగు సీట్ల దూరంలో ఆగిపోయింది. విశ్వాస పరీక్షలో నెగ్గిన అనంతరం పారికర్ విలేఖరులతో మాట్లాడుతూ కాంగ్రెస్‌కు ఎప్పుడూ మెజార్టీకి తగినన్ని స్థానాలు లేవని అన్నారు. ‘కాంగ్రెస్‌కు మెజార్టీ లేదు. కానీ ఉన్నట్టుగా ప్రచారం చేశారు. ఎందుకంటే పార్టీ రాష్ట్ర వ్యవహహారాల ఇంచార్జి దిగ్విజయ్‌సింగ్ రాజీనామా చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఆయన గోవా వచ్చినప్పుడు విహారానికి మాత్రమే వచ్చారు తప్ప పనిచేసేందుకు కాదు’ అని పారికర్ వ్యాఖ్యానించారు. మహారాష్టవ్రాది గోమంతక్ పార్టీ ఎమ్మెల్యే సుదిన్ ధవాలికర్, గోవా ఫార్వర్డ్ పార్టీ నేత విజయ్ సర్దేశాయ్‌ల మద్దతు బిజెపికి ప్రభుత్వం ఏర్పాటులో లాభించింది. కేవలం 13సీట్లు గెలుచుకుని రెండోస్థానంలో నిలిచిన బిజెపిని 21స్థానాలతో అధికారంలోకి వచ్చేట్టు చేసింది. బిజెపి సొంత సభ్యులు కాకుండా జిఎఫ్‌పి నుంచి ముగ్గురు, ఎంజిపి నుంచి ముగ్గురు, ఎన్‌సిపి నుంచి ఒకరు, ముగ్గురు స్వతంత్రులు పారికర్‌కు మద్దతు పలికారు. కాంగ్రెస్ సభ్యుడు పార్టీ వైఖరిని నిరసిస్తూ ఓటింగ్‌కు గైర్హాజరయ్యారు. అసెంబ్లీలో ప్రొ టెమ్ స్పీకర్ సిద్ధార్థ్ కన్‌కోలియెంకర్ డివిజన్ ఓటింగ్‌కు ఆదేశించారు. మార్చి 14న కేంద్ర రక్షణ మంత్రి పదవికి రాజీనామా చేసి గోవా ముఖ్యమంత్రిగా పారికర్ ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే.

చిత్రం..పారికర్ విశ్వాస పరీక్ష కోసం ప్రత్యేకంగా సమావేశమైన గోవా అసెంబ్లీ