జాతీయ వార్తలు

రాష్ట్రానికి అమృత్ నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 17: తెలంగాణలోని పనె్నండు మిషన్ నగరాల్లో ప్రాథమిక పట్టణ ప్రాంత సౌకర్యాల ఏర్పాటుకు అమృత్ పథకం కింద రూ. 1,673 కోట్లు వెచ్చించేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎం వెంకయ్యనాయుడు శుక్రవారం ఆమోదముద్ర వేశారు. 2019-20లోగా ఈ నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అమృత్ పథకం కింద తెలంగాణలోని పనె్నండు మిషన్ పట్టణాల్లో ప్రాథమిక పట్టణ సౌకర్యాలు కల్పించేందుకు 970 కోట్లు ఖర్చు చేయాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఇదివరకే నిర్ణయించింది. తాజాగా శుక్రవారం మరో రూ.703 కోట్లు ఖర్చు చేసేందుకు అనుమతి మంజూరు చేసింది. రాష్ట్రంలోని ఎంపిక చేసిన పట్టణాల్లో ప్రాథమిక సౌకర్యాల కల్పనకు 2015-16లో రూ.415 కోట్లు, 2016-17లో రూ. 555 కోట్లు కేటాయించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ఇదివరకే ఆమోదించినట్టు వెంకయ్యనాయుడు తన ప్రకటనలో వెల్లడించారు. అటల్ మిషన్ ఫర్ రెజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫార్మేషన్ (అమృత్) పథకం కింద తెలంగాణలోని పనె్నండు మిషన్ పట్టణాల్లో ప్రాథమిక సౌకర్యాలు కల్పనకు కేంద్ర సహాయం రూ.832 కోట్లు ఇస్తే, మిగతా మొత్తాన్ని ఆయా పట్టణాలు భరించాల్సి ఉంటుంది. 2017-20కి ఆమోదించిన రూ.703 కోట్లలో రూ.560 కోట్లు మంచి నీటి సరఫరా పథకాలకు వెచ్చిస్తారు. రూ.126 కోట్లు మురుగునీటి పారుదల పథకాలకు వెచ్చిస్తారు. మిషన్ నగరాల్లో ఉద్యానవనాలు, హరితప్రాంతాల అభివృద్దికి రూ.17 కోట్లు కేటాయించారు. వరంగల్ నగరంలో మంచినీటి సౌకర్యాల కల్పనకు రూ.424 కోట్లు ఖర్చు చేస్తారని వెంకయ్య తమ ప్రకటనలో వెల్లడించారు. వరంగల్ పట్టణంలో ఉద్యానవనాల అభివృద్ధికి రూ.1.44 కోట్లు, సిద్దిపేటలో మురుగునీటి వ్యవస్థ అభివృద్ధికి రూ.100 కోట్లు, ఉద్యానవనాల అభివృద్ధికి రూ.1.50 కోట్లు ఖర్చు చేస్తారు. ఖమ్మం పట్టణంలో మంచినీటి సరఫరాకు రూ.47.84 కోట్లు, ఉద్యానవనాల అభివృద్ధికి కోటి రూపాయలు, మహబూబ్‌నగర్ పట్టణంలో మంచినీటి పథకాలకు రూ.41.58 కోట్లు, డ్రైనేజీ వ్యవస్థ ఆధునికీకరణకు రూ.1.5 కోట్లు, నిజామాబాద్ పట్టణంలో మంచినీటి పథకాలకు రూ.4.52 కోట్లు, డ్రైనేజీ వ్యవస్థ ఆధునికీకరణకు రూ.26 కోట్లు, ఉద్యానవనాల అభివృద్ధికి రూ.1.79 కోట్లు ఖర్చు చేస్తారు. కరీంనగర్‌లో మంచినీటి సౌకర్యాల కల్పనకు రూ.24.98 కోట్లు, ఉద్యానవనాల అభివృద్ధికి రూ.1.5 కోట్లు, నల్గొండ పట్టణంలో మంచినీటి పథకాలకు రూ.11.28 కోట్లు, ఉద్యానవనాల అభివృద్ధికి 76 లక్షలు, మిర్యాలగూడ పట్టణంలో మంచినీటి పథకాలకు 4.07 కోట్లు, ఉద్యానవనాల అభివృద్ధికి రూ.1.80 కోట్లు, సూర్యాపేట పట్టణంలో మంచినీటి పథకాలకు రూ.1.45 కోట్లు, ఉద్యానవనాలకు రూ.1.25 కోట్లు ఖర్చు చేయాలని ప్రతిపాదించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఉద్యానవనాలు, హరిత ప్రాంతాల అభివృద్ధికి రూ.2.02 కోట్లు ఖర్చు చేస్తారు. రామగుండంలో ఉద్యానవనాల అభివృద్ధికి రూ.1.5 కోట్లు, ఆదిలాబాద్‌లో ఉద్యానవనాల అభివృద్ధికి 95 లక్షలు ఖర్చు చేస్తారు. ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్‌లోని 33 మిషన్ నగరాల్లో ప్రాథమిక పట్టణ సౌకర్యాల ఏర్పాటుకు రూ.1,057 కోట్ల కేంద్ర సహాయంతో మొత్తం రూ.2,890 కోట్ల వ్యయంతో కూడిన పథకాన్ని ఇదివరకే ఆమోదించటం తెలిసిందే. దేశంలోని మొత్తం యాభై మిషన్ నగరాల్లో పట్టణ ప్రాంత సౌకర్యాల కల్పనకు యాభై వేల కోట్ల వ్యయంతో కూడిన పథకాలను కేంద్రం ఆమోదించిన విషయం తెలిసిందే.