జాతీయ వార్తలు

అది పాక్ నిఘా సంస్థల పనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 17: లాహోర్‌లో కొద్ది రోజుల క్రితం దతా దర్బార్‌ను సందర్శించిన అనంతరం అదృశ్యమైన సూఫీ మత బోధకులు సరుూద్ ఆసిఫ్ అలీ నిజామీ (80), ఆయన మేనల్లుడు నజీమ్ అలీ నిజామీ ఆచూకీని తెలుసుకోవడంలో సహకరించాల్సిందిగా భారత్ నుంచి విజ్ఞప్తి అందిందని పాకిస్తాన్ విదేశాంగ శాఖ కార్యాలయం శుక్రవారం ధ్రువీకరించింది. అయితే వీరిద్దరి అదృశ్యం వెనుక పాక్ గూఢచార సంస్థల ప్రమేయం ఉందని అభిజ్ఞ వర్గాలను ఉటంకిస్తూ ఎఎన్‌ఐ వార్తా సంస్థ వెల్లడించింది. ఇదిలావుంటే, ఈ అంశంపై చర్చించేందుకు దర్గా కమిటీ శుక్రవారం ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో సమావేశమైంది. భారత జాతీయులైన ఈ ఇద్దరు సూఫీ మత బోధకులు ఆచూకీ లేకుండా పోవడం గురించి పాక్ అధికారులతో మాట్లాడినట్లు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి తెలిపారు. సరుూద్ ఆసిఫ్ అలీ నిజామీ, నజీమ్ అలీ నిజామీ ఈ నెల 8వ తేదీన పాకిస్తాన్‌కు వెళ్లారని, వీరు అదృశ్యమైన విషయాన్ని పాక్ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఏదైనా సమాచారం లభిస్తే తెలియజేయాల్సిందిగా కోరామని సుష్మా స్వరాజ్ ట్వీట్ చేశారు. లాహోర్‌లో దతా దర్బార్‌ను సందర్శించేందుకు వెళ్లిన వీరిద్దరు బుధవారం నుంచి కనిపించడం లేదు.
కాగా, బుధవారం వీరిద్దరూ విమానంలో కరాచీ వెళ్లేందుకు సిద్ధమయ్యారని, అయితే ఆసిఫ్‌ను విమానంలోకి అనుమతించిన అధికారులు, పత్రాలు అసంపూర్తిగా ఉన్నాయన్న కారణాలతో నజీమ్‌ను మాత్రం లాహోర్ విమానాశ్రయంలోనే ఆపేశారని వారి కుటుంబ సభ్యులు తెలిపారు.

చిత్రం..అదృశ్యమైన సూఫీ మత బోధకులు సరుూద్ ఆసిఫ్ అలీ నిజామీ, ఆయన మేనల్లుడు నజీమ్ అలీ నిజామీ