జాతీయ వార్తలు

ఉత్తరాఖండ్ కొత్త సిఎం త్రివేంద్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెహ్రడూన్, మార్చి 17: ఉత్తరాఖండ్ బిజెపి లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా త్రివేంద్ర సింగ్ రావత్ ఎన్నికయ్యారు. శుక్రవారం ఇక్కడ సమావేశమైన బిజెపి ఎమ్మెల్యేలు రావత్‌ను తమ నాయకునిగా ఎన్నుకున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. గతంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన రావత్ శనివారం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. బిజెపి కేంద్ర పరిశీలకులు సరోజ్ పాండే, నరేంద్ర తోమర్ పర్యవేక్షణలో కొత్త నాయకుని ఎన్నిక జరిగింది. ఉత్తరాఖండ్‌లో పార్టీని బలోపేతం చేయడంతోపాటు జార్ఘండ్ పార్టీ ఇన్‌చార్జిగా త్రివేంద్ర సింగ్ రావత్ కృషి చేశారు. డొయివాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 24 వేల ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించారు. కాంగ్రెస్ ప్రత్యర్థి హీరా సింగ్ బిష్త్‌పై రావత్ నెగ్గారు. ఆర్‌ఎస్‌ఎస్ స్వయం సేవక్ రావత్ బిజెపి అమిత్‌షాకు అత్యంత సన్నిహితుడు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో అమిత్‌షాతో కలిసి యూపీలో పార్టీ గెలుపునకు ఎంతో కృషి చేశారు. జార్ఖండ్‌లో విజయానికి పాటుపడ్డారని ఉత్తరాఖండ్ బిజెపి చీఫ్ అజయ్‌భట్ స్పష్టం చేశారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు త్రివేంద్ర సింగ్ రావత్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని ఆయన వెల్లడించారు. ఇటీవల ఎన్నికల్లో ఉత్తరాఖండ్‌లో బిజెపి అఖండ విజయం సాధించింది. ఇలా ఉండగా రావత్ ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధాని మోదీ, అమిత్‌షా, పలువురు కేంద్ర మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు హాజరవుతారు. ప్రమాణస్వీకారం జరిగే పెరేడ్ గ్రౌం డ్స్‌లో విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

చిత్రం..ఉత్తరాఖండ్ బిజెపి లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఎన్నికైన త్రివేంద్ర సింగ్ రావత్