జాతీయ వార్తలు

ఏ సవాలుకైనా సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 17: భారత సాయుధ బలగాలు ఎలాంటి సవాలునయినా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నాయని రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. తగినన్ని ఆయుధాలను కొనుగోలు చేయని కారణంగా మన సాయుధ బలగాలు సవాలును ఎదుర్కోవడానికి సంసిద్ధంగా లేవనే అభిప్రాయాన్ని కలుగజేయడానికి ప్రయత్నించొద్దని ఆయన ప్రతిపక్షాలకు హితవు పలికారు. లోక్‌సభలో శుక్రవారం రక్షణ మంత్రిత్వ శాఖకు నిధుల కేటాయింపుపై జరిగిన చర్చలో ఆయన జోక్యం చేసుకుంటూ, ప్రభుత్వం రక్షణ బలగాల అవసరాలను నిర్లక్ష్యం చేసిందని, తగినన్ని నిధులు కేటాయించలేదన్న ప్రతిపక్షాల ఆరోపణను తోసిపుచ్చారు. ప్రభుత్వం గత మూడేళ్లలో రూ. 2.96 లక్షల కోట్లకు పైగా విలువ గల ఆయుధాలు, ఇతర పరికరాల కొనుగోళ్లకు సంబంధించి 147 ఒప్పందాలపై సంతకాలు చేసిందని జైట్లీ వెల్లడించారు. సాయుధ బలగాల్లోని మూడు విభాగాలకు సంబంధించిన ఆయుధాలు, ఇతర పరికరాలు ఈ ఒప్పందాల్లో ఉన్నాయని ఆయన చెప్పారు. ఆర్మీకి 155 ఎంఎం అల్ట్రా లైట్ హోవిట్జర్ గన్‌లు, బ్రహ్మోస్ క్షిపణులు, నావికాదళం కోసం డీప్ సీ రెస్క్యూ మిషన్‌లు, వాయుసేన కోసం అపాచె అటాక్ హెలికాప్టర్లు ఈ ఒప్పందాల్లో ఉన్నాయని ఆయన వివరించారు. ‘ఆయుధాల కొనుగోలు జరగడం లేదని, మన సైన్యం సర్వసన్నద్ధంగా లేదనే అభిప్రాయాన్ని కలిగించొద్దు. మన రక్షణ బలగాలు ఎలాంటి సవాలునయినా ఎదుర్కొనేందుకు పూర్తి సన్నద్ధంగా ఉన్నాయి’ అని ఆయన పేర్కొన్నారు. రక్షణ బలగాల సన్నద్ధత అంశాన్ని రాజకీయం చేయకూడదని ఆయన హితవు పలికారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం రక్షణ రంగంలో విఫలమయిందన్న ఆరోపణను జైట్లీ తోసిపుచ్చారు. రూ. 4.45 లక్షల కోట్లకు పైగా విలువ గల 134 ప్రతిపాదనలపై సంతకాలు అయ్యాయని ఆయన చెప్పారు. ప్రభుత్వం ఆయుధాల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు మరింత పారదర్శకం చేయడానికి కృషి చేసిందని ఆయన అన్నారు.

చిత్రం..లోక్‌సభలో మాట్లాడుతున్న రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ