జాతీయ వార్తలు

జస్టిస్ కర్ణన్‌కు వారెంట్ అందజేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, మార్చి 17: కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి సిఎస్ కర్ణన్‌కు సుప్రీం కోర్టు జారీ చేసిన బెయిలబుల్ వారెంట్‌ను శుక్రవారం అందచేశారు. పశ్చిమ బెంగాల్ పోలీసు డైరెక్టర్ జనరల్ సుర్జిత్ కర్ పురకాయస్థ న్యూటౌన్ ప్రాంతంలో ఉంటున్న కర్ణన్ ఇంటికి స్వయంగా వెళ్లి వారెంట్ అందజేశారు. జస్టిస్ కర్ణకు ఈనెల 14న సుప్రీం కోర్టు ధిక్కరణ నోటీసు జారీ చేసింది. కోల్‌కతా పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్, సిఐడి డిఐజి రాజేష్‌కుమార్‌లను వెంటబెట్టుకెళ్లి జస్టిస్‌కు బెయిలబుల్ వారెంట్ అందజేశారు.‘డిజిపి పరకాయస్థ ఉదయం న్యూటౌన్ ఏరియాలోని జస్టిస్ కర్ణన్ ఇంటికి వెళ్లారు. సుప్రీం కోర్టు జారీ చేసిన బెయిలబుల్ వారెంట్ ఆయనకు అందజేశారు’అని సీనియర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు న్యాయమూర్తి నివాసం ఎదుట మోహరించాయి. ఈనెల 31న తమ ముందు హాజరుకావాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. న్యాయమూర్తుల్లోనే అనేక మంది అవినీతిపరులున్నారంటూ కర్ణన్ చేసిన వ్యాఖ్యలు సుప్రీంకు ఆగ్రహాన్ని తెప్పించాయి. అయితే తనకు వారెంట్ జారీ చేసే అధికారం సుప్రీం కోర్టుకు లేదని కర్ణన్ వాదిస్తున్నారు. దళితుడినైనందుకే తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. అంతటితో ఆగని జస్టిస్ కర్ణన్ ఏకంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జెఎస్ ఖెహార్‌తోపాటు ఆరుగురు జడ్జిలపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు.