జాతీయ వార్తలు

సివిల్స్-2016 నోటిఫికేషన్ వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: సివిల్ సర్వీస్-2016 పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలను యుపిఎస్‌సి వాయిదా వేసింది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి కారణాలు వెల్లడించలేదు. వాస్తవానికి శనివారమే నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది.
‘2016 సివిల్ సర్వీస్ పరీక్షలు నోటిఫికేషన్ ఈనెల 23న విడుదల చేయాల్సి ఉంది. అయితే దాన్ని వాయిదావేశాం’అని యుపిఎస్‌సి ప్రకటించింది. సివిల్స్‌తోపాటు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ప్రిలిమ్స్) పరీక్షలకు నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది. యుపిఎస్‌సి ఆధ్వర్యంలోనే అత్యున్నత సివిల్స్ పరీక్షలు జరుగుతాయి. ప్రతిఏటా మూడు దశలుగా పరీక్షలు నిర్వహిస్తారు. ప్రిలిమ్స్, మెయిన్, ఇంటర్‌వ్యూలను యుపిఎస్‌సి పర్యవేక్షణలోనే జరుగుతాయి. ప్రతిష్టాత్మక ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్(ఐఎఎస్), ఇండియన్ ఫారెన్ సర్వీస్(ఐఎఫ్‌ఎస్), ఇండియన్ పోలీసు సర్వీస్(ఐపిసి)లలో ఎంపికకు సివిల్సే ప్రామాణికం.
సివిల్స్ పరీక్షలకు సంబధించి వయోపరిమితి మినహాయింపు, అర్హత, సిలబస్ తదితర అంశాలపై అధ్యయనం చేయడానికి హెచ్‌ఆర్‌డి మాజీ కార్యదర్శి, రిటైర్డ్ ఐఎఎస్ బిఎస్ బిశ్వాన్ అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆగస్టు నాటికి కమిటీ నివేదిక ఇవ్వాల్సి ఉంది.