జాతీయ వార్తలు

అభివృద్ధికి మరో ఉద్యమం రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 18: భారత దేశం అభివృద్ధి చెందడానికి స్వాతం త్య్ర పోరాటాన్ని పోలిన మరో ఉద్య మం రావాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయ పడ్డారు.‘ స్వాతంత్రోద్యమం తరహాలో అభివృద్ధి ఊపందుకునేందుకు కూడా ఒక ఉద్యమం రావాలి. ప్రజలందరి ఆకాంక్షలే అభివృద్ధిని ము న్ముందుకు తీసుకెళ్లేదిగా ఆ ఉద్యమం ఉండాలి’ అని శనివారం ఇక్కడ జరుగుతున్న ‘ఇండియా టుడే సదస్సు’ నుద్దేశించి చేసిన వీడియో ప్రసంగంలో మోదీ అన్నారు. ‘ఒక నూతన భారతం కలను సాకారం చేసుకోవడంలో మనమంతా పాలుపంచుకోవాలి. ఈ నూతన భారతం మంత్రం అందరికీ అవకాశం, అత్మ గౌరవం కలిగిన భారతంగా ఉండాలి అని మోదీ అన్నారు. అనేక దశాబ్దాలుగా మనం తప్పు దారిలో, తప్పుడు విధానాలతో ముందుకు సాగుతున్నామని ఆయన అన్నారు. ‘అప్పట్లో నిర్ణయాలన్నీ కూడా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనో, లేక అధికారులకున్న బలమైన అభిప్రాయాల ఆధారంగానో ఉండేవి. అయితే ఇప్పుడు ఇది మారిపోయింది’ అని ప్రధాని అన్నారు. తమ ప్రభుత్వం దేశం ఎదుర్కొంటున్న సమస్యలను సంకుచిత దృష్టితో కాక సమగ్రదృష్టితో చూస్తోందని కూడా ఆయన చెప్పారు. ఇండియా టుడే ఎడిటర్ ఇన్ చీఫ్ అరుణ్ పూరి తనను ‘డిస్ప్రప్టర్-ఇన్-చీఫ్’గా అభివర్ణించడాన్ని ప్రధాని ప్రస్తావిస్తూ, ఇది తనకన్నా ఈ దేశ ప్రజలకు బాగా సరిపోతుందన్నారు. ఇప్పుడు ఈ దేశ ప్రజలు చెడ్డ వాటిని అక్కడికక్కడే అంతం చేయడానికి ముందుకు వస్తున్నారని, ఇది నూతన భారత దేశ మూలాలను బలోపేతం చేస్తుందని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం అనుసరిస్తున్న కొన్ని విధానాలపై ఉన్న భయాలను ఆయన కొట్టిపారేస్తూ ఇది వ్యవస్థను నాశనం చేసే ప్రభుత్వం కాదని, కాయకల్ప చికిత్స చేసేదని అన్నారు.
తమ ప్రభుత్వం పనిసంస్కృతిలో మార్పు తీసుకు వచ్చిందని, ఉద్యోగుల సామర్థ్యాన్ని మెరుగుపర్చడానికి వారిలో కొత్త చైతన్యాన్ని తీసుకుని వచ్చే ప్రక్రియలు చేపడుతోందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. గత ఇరవై ఏళ్లలో టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని ప్రధాని అంటూ ఇప్పుడు యువత ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకోవలసిన అవసరం ఉందన్నారు.