జాతీయ వార్తలు

22న శిక్షలు ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, మార్చి 18: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆజ్మీర్ దర్గా పేలుళ్ల కేసులో దోషులకు ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు ఈ నెల 22న శిక్షలు ఖరారు చేయనుంది. భవేష్‌పాటిల్, దేవేంద్ర గుప్తా, సునీల్ జోషీలను కోర్టు ఈ నెల 8న దోషులుగా తీర్పునిచ్చింది. స్వామీ ఆసీమానంద్ సహా పలువురని న్యాయస్థానం నిర్దోషులుగా విడుదల చేసింది. అయితే జోషి కేసు విచారణలో ఉండగానే మృతి చెందాడు. దీంతో ఇద్దరికి శిక్షలు ఖరారు చేయనున్నారు. బుధవారం ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు ఇద్దరు ముద్దాయిలకు శిక్షలు ప్రకటిస్తుందని డిఫెన్స్ న్యాయవాది జగదీశ్ రాణా తెలిపారు. 2017 అక్టోబర్ 11న ఖాజా మొహిద్దీన్ ఛిస్టీ దర్గా వద్ద జరిగిన పేలుళ్లలో ముగ్గురు మృతిచెందారు. 15 మంది గాయపడ్డారు. తొలుత కేసు దర్యాప్తును రాజస్థాన్ ఏటిఎస్ చేపట్టి, తరువాత ఎన్‌ఐఏకు బదిలీ చేసింది. 2011 ఏప్రిల్ 6న ఢిల్లీలోని ఎన్‌ఐఏ పోలీసు స్టేషన్‌లో కేసును నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో 149 మంది సాక్షులను విచారించారు. ఎన్‌ఐఏ మూడు అనుబంధ చార్జిషీట్లు దాఖలు చేసింది.