జాతీయ వార్తలు

ఓట్లు కురిపించిన ‘ట్రిపుల్ తలాఖ్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాంధీనగర్, మార్చి 18: ‘ట్రిపుల్ తలాఖ్’తో బాధపడుతున్న ముస్లిం మహిళలు బిజెపికి ఉత్తరప్రదేశ్‌లో మద్దతు పలికారని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ట్రిపుల్ తలాఖ్ బాధితులైన మహిళలు ఉత్తరప్రదేశ్‌లోనే ఎక్కువగా ఉన్నారని ఆయన అన్నారు. గుజరాత్ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం 8వ స్నాతకోత్సవ సభలో ఆయన ప్రసంగిస్తూ ‘ట్రిపుల్ తలాఖ్ అంశంపై బిఎస్పీ అధినేత్రి మాయావతి కానీ, కాగ్రెస్ నేత ప్రియాంక గాంధీ కానీ, అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ కానీ తమ వైఖరిని వ్యక్తం చేయకపోవటం దురదృష్టం’ అని ఆయన అన్నారు. ఈ వ్యవహారం మతానికి సంబంధించింది కానే కాదని, లింగ వివక్షకు సంబంధించిందని ప్రసాద్ వ్యాఖ్యానించారు. ‘ఈ వ్యవహారం సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఇది మతపరమైన అంశం కాదు. ఇది లింగ వివక్షకు, స్ర్తి పురుష సమానత్వానికి, గౌరవానికి సంబంధించింది’ అని ఆయన స్పష్టం చేశారు. అంటరానితనం ఏ విధంగా రాజ్యాంగానికి వ్యతిరేకమైనదో, మహిళల పట్ల ఎలాంటి వివక్షాపూరిత చర్య కూడా రాజ్యాంగానికి విరుద్ధమేనని ఆయన వివరించారు. ప్రపంచంలో 20 ముస్లిం దేశాలు ట్రిపుల్ తలాక్ విధానానికి పరిమితులు విధించటమో, పూర్తిగా నిషేధించటమో చేశాయని ప్రసాద్ తెలిపారు. అయోధ్యలో చట్టబద్ధంగానే అద్భుతమైన రామమందిరాన్ని నిర్మిస్తామని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు అనుకూలంగా తీర్పు చెప్తుందని భావిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు.

చిత్రం..గుజరాత్ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పట్టా ప్రదానం చేస్తున్న
కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్