జాతీయ వార్తలు

ఆకలి, హింస మానవ కల్పితాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోపాల్, మార్చి 19: నిర్లక్ష్యం, ధనికులు, పేదల మధ్య విపరీత అంతరం ఉన్న కారణంగానే అనేక సమస్యలు ముఖ్యంగా హింస, ఆకలి ఉన్నాయని, టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా అన్నారు.
ఆదివారం ఇక్కడ ఆర్ట్ ఆఫ్ హ్యాపీనెస్’ అనే అంశంపై దలైలామా మాట్లాడుతూ, భారత దేశంలో వివిధ మతాల మధ్య సామరస్యం ఉందని, అన్ని మతాల వారు ఇక్కడ ప్రశాంతంగా జీవిస్తున్నారన్నారు. ‘అయితే రాజకీయ నాయకుల కారణంగా అప్పుడప్పుడు కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. దాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. మనుషుల్లో కొంతమంది ఆకతాయిలున్నారు’ అని దలైలామా అన్నప్పుడు సభకు హాజరయిన వారంతా గొల్లుమని నవ్వేశారు. ‘నేటి ప్రపంచంలో అనేక సమస్యలున్నాయి. భూకంపాలు, వరదలులాంటి భారీ విపత్తులు మన చేతుల్లో ఉండవు. అయితే నిర్లక్ష్యం, ధనికులు, పేదల మధ్య విపరీతమైన అంతరం కారణంగా కొన్ని సమస్యలు ముఖ్యంగా హింస, ఆకలి ఉంటున్నాయి’ అని ఆయన అన్నారు.
భారత దేశంలో 2వేల సంవత్సరాలుగా దేశంలోని మతాలే కాకుండా బయటి ప్రాంతాలకు చెందిన క్రైస్తవం, ఇస్లాం లాంటి మతాలకు చెందిన వారు కలిసి మెలిసి జీవిస్తున్నారు, ఇలాంటి ప్రత్యేకత ప్రపంచంలో మరే దేశంలోను లేదని దలైలామా అన్నారు. భిన్న సంప్రదాయాలు కలిసి మనగలవనే విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని ఆయన భారతీయులకు విజ్ఞప్తి చేశారు. హింస, హత్యలు, ఆకలి లాంటి వాటిని సృష్టించింది మనుషులేనని ఆయన అంటూ, ఇలాంటి వాటిని పట్టించుకోకుండా ఉండడం తెలివైన మనిషి చేయాల్సిన పని కాదని అన్నారు.

చిత్రం..ఆర్ట్ ఆఫ్ హ్యాపీనెస్ అనే అంశంపై ఆదివారం భోపాల్‌లో జరిగిన
కార్యక్రమంలో పాల్గొన్న టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా