జాతీయ వార్తలు

అసమ్మతే.. ఫిరాయింపు కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నైనితాల్/ న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పదవి నుంచి హరీశ్ రావత్‌ను తొలగించాలనే తాము కోరాము తప్ప కాంగ్రెస్ పార్టీని వీడిపోలేదని స్పీకర్ అనర్హులుగా ప్రకటించిన తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సోమవారం రాష్ట్ర హైకోర్టుకు చెప్పారు. హరీశ్ రావత్ ప్రభుత్వం పట్ల తాము అసమ్మతిని వ్యక్తం చేశామని, కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించలేదని వారు వివరించారు. హరీశ్ రావత్ స్థానంలో మరో నాయకుడి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని, అప్పుడు అది మెరుగైన ప్రభుత్వంగా ఉంటుందని తాము కాంగ్రెస్ పార్టీని కోరామని చెప్పారు. మరోవైపు, ఉత్తరాఖండ్‌లో తొమ్మిది మందికన్నా ఎక్కువ మంది కాంగ్రెస్ అసమ్మతి ఎమ్మెల్యేల మద్దతు తమకు ఉందని బిజెపి పేర్కొంది. స్పీకర్ అనర్హులుగా ప్రకటించిన తొమ్మిది మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలే కాకుండా మరింత మంది ఆ పార్టీ ఎమ్మెల్యేల మద్దతు తమకు ఉందని, అసెంబ్లీలో బల నిరూపణ జరిగితే వారు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారని ఒక సీనియర్ బిజెపి నాయకుడు ఢిల్లీలో చెప్పారు. ఈ తొమ్మిది మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు అనర్హతకు గురైనా అసెంబ్లీలో మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు తమకే ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
హరీశ్ రావత్ ప్రభుత్వం వల్ల పార్టీ పరిస్థితి బాగాలేదని, అందువల్ల ఆయనను సిఎం పదవి నుంచి దించివేయడం ద్వారా పార్టీని ప్రక్షాళన చేయాలని మాత్రమే తాము కోరామని తొమ్మిది మంది కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఉత్తరాఖండ్ హైకోర్టు న్యాయమూర్తి యుసి ధ్యానికి చెప్పారు. తాము బిజెపితో చేతులు కలిపినప్పటికీ, అసెంబ్లీలో ‘డివిజన్ ఆఫ్ వోట్స్’ను కోరుతూ గవర్నర్‌కు పంపించిన మెమోలో సంతకం చేసిన సమయంలో తాము బిజెపి నుంచి వేరుగా చూపుకున్నామని తొమ్మిది మంది ఎమ్మెల్యేలు వివరించారు. స్పీకర్ గోవింద్ సింగ్ కున్‌జ్వాల్ తమను అనర్హులుగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ తొమ్మిది మంది తిరుగుబాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా వారి తరపున సీనియర్ న్యాయవాది సిఎ సుందరం వాదిస్తూ అధికార పార్టీ ఎమ్మెల్యే తమ ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యంలో భాగమని, అది పార్టీని వీడినట్లు కాదని అన్నారు. ముఖ్యమంత్రి, స్పీకర్ ఇద్దరు కూడా ప్రభుత్వం, పార్టీ రెండూ ఒకటేనని భావిస్తున్నారని, ఈ దృక్పథాన్ని అంగీకరిస్తే ప్రజాస్వామ్యానికి అంతిమ ఘడియలు ప్రాప్తించినట్లేనని ఆయన వాదించారు.