జాతీయ వార్తలు

నేరస్థుల పోటీపై జీవితకాలం వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 20: నేరస్థులుగా రుజువైన వ్యక్తులను జీవితాంతం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని ఎన్నికల కమిషన్ సోమవారం సుప్రీం కోర్టులో స్పష్టం చేసింది. అలాగే ఇలాంటి వ్యక్తులు న్యాయ వ్యవస్థలోకి, ప్రభుత్వంలోకి ప్రవేశించకుండా కూడా నిషేధం విధించడానికి సానుకూలత వ్యక్తం చేసింది. ప్రజా ప్రతినిధులు, అధికారులు, న్యాయ వ్యవస్థకు చెందిన సభ్యులపై వచ్చే క్రిమినల్ ఆరోపణలను దర్యాప్తు చేయడానికి ప్రత్యేక కోర్టులను నియమించాలని కూడా ఇసి సూచించింది. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థకు చెందిన వ్యక్తులకు సంబంధించిన క్రిమినల్ కేసులపై దర్యాప్తుకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలంటూ దాఖలైన ప్రజాహిత పిటిషన్‌కు సమాధానంగా ఇసి సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. పిటిషనర్ అశ్వనీ కుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిల్ ప్రతికూలమైనదేమీ కాదని, ఈ పిటిషన్‌కు సమాధానం చెప్పడం వల్ల అతని వాదనను మరింత బలపరచినట్లే అవుతుందని కూడా పేర్కొంది. అలాగే ఎన్నికల్లో పోటీకి కనీస వయస్సు, కనీస విద్యార్హతలను నిర్ణయించాలన్న అంశంపైకూడా ఇసి స్పందించింది. ఇది శాసన విభాగానికి సంబంధించిన అంశమని, ఇందుకు రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం ఉందని తెలిపింది.