జాతీయ వార్తలు

రైల్వే బడ్జెట్‌కు లోక్‌సభ ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 20: కేంద్ర రైల్వేశాఖ ద్రవ్వ వినిమయ బిల్లుకు సోమవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరానికి నిధుల మంజూరు డిమాండ్లకు సంబంధించి అనుబంధ బిల్లులకు ఆమోదం తెలిపింది. 2017-18 సంవత్సరానికి 1,31,000 కోట్ల రూపాయల వ్యయంకాగల బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఇది గత ఏడాదికంటే 8 శాతం ఎక్కువ. ఇది గత ఏడాది 1,21,000 కోట్ల రూపాయలు. 2017-18లో రైల్వే ఆదాయం 1,78,350 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. గత ఏడాదితో పోలిస్తే ఇది తొమ్మిది శాతం పెరుగుదల అధికం. 2016-17 కంటే అధికంగా డిమాండ్స్ ఆఫ్ గ్రాంట్స్ ఎక్కువ. కేంద్ర సాధారణ బడ్జెట్‌తోపాటే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇప్పటివరకూ రెండు బడ్జెట్లూ విడివిడిగానే ప్రవేశపెట్టేవారు. 1924నుంచి ఇదే జరుగుతోంది. మొట్టమొదటిసారిగా ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండు బడ్జెట్‌లను కలిపి జైట్లీ సభ ముందు ఉంచారు.