జాతీయ వార్తలు

ఆందోళన వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 20: హెచ్1బి వీసాల విధానంలో మార్పులు చేయడంవల్ల పెద్దగా ప్రతికూల ప్రభావం ఉండదని అమెరికా భరోసా ఇచ్చింది. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసినట్టు కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం వెల్లడించారు. లోక్‌సభలో ఈ మేరకు మంత్రి ఒక ప్రకటన చేస్తూ హెచ్1బి వీసాలకు సంబంధించి కీలకమైన మార్పులు ఉండవని అన్నారు. అక్రమ వలసలను నిరోధించాలన్న ఉద్దేశంతోనే వీసా విధానంలో మార్పులకు శ్రీకారం చుట్టారని ఆమె పేర్కొన్నారు. భారతీయుల్లో ఉన్న ఆందోళనను అమెరికా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్టు ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో మంత్రి తెలిపారు.
జకీర్ నాయక్‌కు మళ్లీ నోటీసు
న్యూఢిల్లీ, మార్చి 20: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) సోమవారం మరోసారి వివాదాస్పద ఇస్లాం మత ప్రబోధకుడు జకీర్ నాయక్‌కు నోటీసులు జారీ చేసింది. ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద నమోదయిన కేసులో మార్చి 30న తన ముందు హాజరు కావాలని రెండోసారి జారీ చేసిన ఈ నోటీసులో ఆదేశించింది. మార్చి 14న హాజరు కావాలని ఈ నెల మొదట్లో మొదటిసారి జారీ చేసిన నోటీసులో ఎన్‌ఐఎ ఆదేశించిన విషయం తెలిసిందే.