జాతీయ వార్తలు

బిసిలకు మంత్రిత్వ శాఖను కేటాయించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 20: దేశంలోని కోట్లాది మంది వెనుకబడిన కులాల ప్రజల సంక్షేమానికి కేంద్రంలో ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని బిసి ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. వెనుకబడిన కులాలకు చెందిన పార్లమెంటు సభ్యులు సోమవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఆయన కార్యాలయంలో కలుసుకుని వినతిపత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన బూర నరసయ్య గౌడ్, తెలుగుదేశం పార్టీకి చెందిన కింజారపు రామమోహన్ నాయకుడు, సాక్షి మహారాజ్ తదితర ఇరవై మంది ఎంపీలు ప్రధానిని కలిసి వెనుకబడిన కులాలకు చెందిన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించారు. ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తేనే బిసిల సమస్యలు పరిష్కారమవుతాయని వారు ప్రధానికి సూచించారు. వెనకబడిన కులాల జాతీయ బిసి కమిషన్‌కు రాజ్యాంగపరమైన స్థాయి కల్పించాలని వారు కోరారు. బిసి క్రీమిలేయర్ పరిమితిని సడలించాలని, బడ్జెట్‌లో బిసిలకు నిధులు గణనీయంగా పెంచాలని, బిసి గణాంకాలు విడుదల చేయాలని కోరారు.