జాతీయ వార్తలు

అవి విద్వేష దాడులే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 20: అమెరికాలో ఇటీవల భారతీయులపై జరుగుతున్న దాడులు సాధారణ శాంతిభద్రతల సమస్య కానే కాదని, అవి ‘విద్వేష దాడులే’నని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ రాజ్యసభలో స్పష్టం చేశారు. అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం జాతీయ ప్రయోజనాలను పణంగా పెట్టే ప్రశే్న లేదని సుష్మా స్పష్టం చేశారు. రాజ్యసభలో సోమవారం ఆమె ఇందుకు సంబంధించి ఒక ప్రకటన చేశారు. ‘‘అమెరికాలో ఇటీవల జరిగిన దాడులను కేవలం శాంతిభద్రతల సమస్యగా మేం చేడటం లేదు. చాలా సాధారణమైన నేరాలుగా పరిగణించటం లేదు. ఇవి నూటికి నూరు శాతం విద్వేష దాడులే’’ అని సుష్మా స్పష్టం చేశారు. ఈ దాడులపై సమగ్రమైన విచారణ జరగాల్సిందేనని ఆమె పేర్కొన్నారు. ఫిబ్రవరి 22న కాన్సాస్‌లో కూచిభొట్ల శ్రీనివాస్, మార్చి 2న హర్నిశ్ పటేల్‌ను అమెరికా జాతి విద్వేషకారులు హతమార్చిన సంగతి తెలిసిందే. మార్చి 4న దీప్ రాయ్ అనే భారతీయుడిపైనా కాల్పులు జరిగాయి. ‘‘ ఈ దాడుల వ్యవహారాన్ని అత్యున్నతస్థాయి దృష్టికి తీసుకువెళ్తున్నాం. దీని వెనుక వ్యూహాత్మక కుట్ర ఏదైనా దాగి ఉందా అన్న విషయాన్ని పరిశీలిస్తున్నాం’ అని ఆమె తెలిపారు. అమెరికా యంత్రాంగం మాత్రం ఎలాంటి కుట్రా లేదని అంటోందని ఆమె వివరించారు. ఈ అంశంపై సిపి ఐ నేత డి రాజా మాట్లాడుతూ అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యం, ఈ దాడులకు సంబంధించి ఆ దేశంపై ఒత్తిడి చేయకుండా అడ్డుకుంటోందని ఆరోపించారు. ఇందుకు సుష్మా స్పందిస్తూ ‘వ్యూహాత్మక భాగస్వామ్యం అంటే జాతీయ ప్రయోజనాలతో రాజీ పడటం కాదు. ఏం జరిగినా మనం వౌనంగా ఉంటామని అర్థం కాదు. ముందు మన దేశప్రజల భద్రతే మనకు ప్రాధాన్యం’’ అని ఆమె స్పష్టం చేశారు.