జాతీయ వార్తలు

వొడా-ఐడియా విలీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 20: బ్రిటిష్ టెలికం సంస్థ వొడాఫోన్, ఆదిత్య బిర్లా సారథ్యంలోని ఐడియా సెల్యులర్ సంస్థలు విలీనమయ్యాయి. దీంతో అత్యధిక వినియోగదారుల సంఖ్య రెవిన్యూ మార్కెట్ కల్గిన ఓ భారీ మొబైల్ సంస్థ ఏర్పాటైనట్లయింది. రానున్న రెండేళ్ల కాలంలో ఈ విలీన సంస్థ ఏకీకృత రూపంలో అమలులోకి వస్తుందని, దీనికి కుమారమంగళం బిర్లా చైర్మన్‌గా వ్యవహరిస్తారని ప్రకటించారు. ఈ సంస్థలో వొడాఫోన్ ప్రధాన అధికారిగా తన ప్రతినిధిని నియమిస్తుంది. సోమవారం జరిగిన మీడియా సమావేశంలో వొడాఫోన్ సీ ఈ ఓ విక్టోరియో కోలావో ఈ మేరకు ప్రకటన చేశారు. కొత్త కంపెనీలో వొడాఫోన్ 45.1 శాతం వాటా ఉంటుంది. దాదాపు 3874కోట్ల రూపాయల విలువ కలిగిన 4.9శాతం తన వాటాను ఆదిత్య బిర్లా గ్రూపునకు బదలాయించినప్పటికీ వొడాఫోన్‌కు 45.1శాతం మేర వాటా ఉంటుంది. ఇక ఉమ్మడి సంస్థలో ఐడియా సెల్యులర్ 26శాతం వాటా ఉంటుంది. మిగతామొత్తాన్ని వాటాలుగా విక్రయిస్తారు. వాటాదారుల ఒప్పందం ప్రకారం ఈ విలీన సంస్థను సంయుక్తంగా నిర్వహిస్తామని వొడాఫోన్-బిర్లాగ్రూప్ ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో వొడాఫోన్ 204.68మిలియన్ల మేర వినియోగదారులున్నారు. తద్వారా 18.16శాతం మేర మార్కెట్ వాటాను ఈ సంస్థ కలిగి ఉంది. అలాగే 190.51మిలియన్ వినియోగ దారులతో ఐడియా సంస్థకు 16.9శాతం మేర మార్కెట్ వాటా ఉంది. ప్రస్తుతం రెవిన్యూ పరంగానూ అటు వినియోగదారుల పరంగానూ ఎయిర్‌టెల్‌కు అత్యధిక స్థాయిలో మార్కెట్ వాటా ఉంది. దీని మార్కెట్ వాటా 23.58శాతం కాగా వినియోగ దారుల సంఖ్య 267.87మిలియన్లు. తాజాగా వొడాఫోన్- ఐడియా విలీనం వల్ల ఏర్పడ్డ సంస్థకు దాదాపు 80వేల కోట్ల రూపాయల రెవిన్యూతో పాటు, దాదాపు 400మిలియన్ వినియోగదారులు చేరతారు. ఈ ఉమ్మడి సంస్థ కేటాయించిన స్పెక్ట్రంలో 25శాతం వాటా కలిగి ఉంటుంది. స్పెక్ట్రం నిబంధనల ప్రకారం 5400 కోట్ల రూపాయల మేర ఒక శాతం వాటాను ఈ సంస్థ విక్రయించాల్సి ఉంటుంది. ఈ విలీనం వల్ల వొడాఫోన్ ఇండియా మార్కెట్ విలువ 82,800 కోట్లు, ఐడియా విలువ 72,200 కోట్లు ఉంటుందని అంచనా వ్యక్తమవుతోంది. డిసెంబర్ 16నాటికి ఈ రెండు సంస్థల ఉమ్మడి రుణభారం లక్ష కోట్ల రూపాయలు. ప్రభుత్వంతో తమకున్న పన్నుల వివాద ప్రభావం ఈ విలీన ప్రక్రియపై ఎంతమాత్రం ఉండదని వొడాఫోన్ సిఇఓ స్పష్టం చేశారు. కొత్త కంపెనీ బోర్డులో ఈ రెండు సంస్థలు ముగ్గురేసి చొప్పున ప్రతినిధులను కలిగి ఉంటాయి.