జాతీయ వార్తలు

డిప్లొమా ఇంజనీర్లకు మెరుగైన ఉపాధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 20: ఇంజనీరింగ్ డిప్లొమా హోల్డర్ల ఉపాధి అవకాశాలను పెంచేందుకు తమ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని కేంద్ర మానవ వనరుల శాఖ సహా య మంత్రి మహేంద్రనాథ్ పాండే తెలిపారు. వైఎస్‌ఆర్‌సిపి సభ్యుడు వైవి సుబ్బారెడ్డి సోమవారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వకంగా జవాబిచ్చారు. ఇంజనీరింగ్ డిప్లొ మా పాస్ అయిన వారికి ఉపాధి అర్హత లేదంటూ ఇటీవల జరిగిన ఒక సర్వే సూచించటం తన దృష్టికి కూడా వచ్చిందని మంత్రి చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఏఐసిటిఈ (అఖిల భారత సాంకేతిక విద్యా సమాఖ్య) తగు చర్య లు తీసుకుంటోందని మహేంద్రనాథ్ పాండే చెప్పారు. సాంకేతిక సంస్థల నుండి ఉత్తీర్ణులదవుతున్న ఇంజనీర్ల ఉపాధి అర్హతను పెంచేందుకు కృషి చేస్తున్నామంటూ జాతీయ ఉపాధి కల్పన విస్తరణ మిషన్, ఉపాధి కల్పన, విస్తృత శిక్షణ కార్యక్రమం ఈ దిశగా పని చేస్తున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఏఐసిటిఈ మార్చి 14న నిర్వహించిన సమావేశంలో డిప్లొమా ఇంజనీర్ల ఉపాధి అర్హత పెంచేందుకు పలు చర్యలను ఆమోదించిందన్నారు. ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేయటం, పరిశ్రమల యాజమాన్యాలు, సాంకేతిక నిపుణులు, ఇతర సంబంధిత ప్రముఖులతో చర్చించి పరిశ్రమ అవసరాల మేరకు పాఠ్యాంశాలను సవరిస్తున్నామని మహేంద్రనాథ్ పాండే వివరించారు. డిప్లొమా ఇంజనీర్లు, డిగ్రీ ఇంజనీర్ల మధ్య పోలిక మంచిది కాదని మంత్రి స్పష్టం చేశారు.