జాతీయ వార్తలు

మా ఆదేశాలు మీకు పట్టవా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 25: డాన్స్‌బార్‌లు ఏర్పాట్లుపై మహారాష్ట్ర ప్రభుత్వం తీరుపై సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను పట్టించకోకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. డాన్స్‌బార్‌లకు అనుమతులు మంజూరుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను కోర్టు తప్పుపట్టింది. విద్యా సంస్థలకు ఒక కిలోమీటర్ అవతలే డాన్స్‌బార్‌లకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేసును విచారించిన సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.‘డాన్స్ అన్నది కూడా ఓ వృత్తి. అభ్యంతరకర, అశ్లీలతకు తావు ఉండకూడదు. ఎక్కడైనా అలాంటివి చోటుచేసుకుంటే చట్టవ్యతిరేకతే. దాన్ని అరికట్టడానికి ప్రభుత్వం తీసుకునే చర్యలు నిషేధానికి దారితీయకూడదు’అని సుప్రీం స్పష్టం చేసింది.‘మహిళను రోడ్లపై భిక్షాటనం చేయడం తప్పుగానీ,బార్‌లలో డాన్స్ చేయడాన్ని తప్పుగా చూడకూడదు’అని కోర్టు పేర్కొంది. మహారాష్టల్రో డాన్స్‌బార్‌లు, రెస్టారెంట్లకు అనుమతికి సుప్రీం కోర్టు ఇటీవల అనుమతి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు ఆమోదం తెలిపింది. అయితే రెస్టారెంట్లు, డాన్స్‌బార్‌ల లోపల సిసిటివిలు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వం తరువాత ప్రవేశ ద్వారాల వద్దేనని చెప్పింది. 2005 లో మహారాష్ట్ర ప్రభుత్వం డాన్స్‌బార్‌లను నిషేధించింది. రాష్ట్రంలో సుమారు 1500 బార్లు మూతపడడంతో 75వేల మంది మహిళా డాన్సర్లు వీధినపడ్డారు.