జాతీయ వార్తలు

మూడు కాదు, రెండు లక్షలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 21: నగదు లావాదేవీల పరిమితి మూడు నుంచి రెండు లక్షలకు కుదించాలని ప్రతిపాదించటం ద్వారా ఎన్డీయే ప్రభుత్వం సంచలనం సృష్టించింది. నగదు లావాదేవీలను మూడు లక్షలకు పరిమితం చేస్తున్నట్టు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్‌లో ప్రతిపాదించటం తెలిసిందే. అయితే దీన్ని రెండు లక్షలకు పరిమితం చేస్తూ కేంద్రం మంగళవారం ఆర్థిక బిల్లుకు సవరణ ప్రతిపాదించింది. అంతేకాదు, ఆర్థిక బిల్లుకు దాదాపు 40 సవరణలు ప్రతిపాదించి అందరినీ ఆశ్చర్యపర్చింది. ఆర్థిక బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో సవరణ ప్రతిపాదనలు చేపట్టడాన్ని టిఎంసి, బిజెడి, ఆర్‌ఎస్‌పి తదితర పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రభుత్వం దొడ్డిదారిన సవరణలు ప్రతిపాదించటం ఎంతమాత్రం సమర్థనీయం కాదని విమర్శించాయి. స్పీకర్ సుమిత్రా మహాజన్ మాత్రం ప్రతిపక్షం అభ్యంతరాలను కొట్టివేశారు. ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలు మనీ బిల్లు పరిధిలోకి వస్తాయి కనుక, వీటిని ఆర్థిక బిల్లులో చేర్చటంలో ఎలాంటి తప్పూలేదని స్పష్టం చేశారు. ఆర్థిక బిల్లుకు సవరణలు ప్రతిపాదించే అధికారం ప్రభుత్వానికి ఉందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వాదించారు. నగదు పరిమితి కుదింపు అంశం ఏప్రిల్ 1నుంచి అమల్లోకి వస్తుంది. రెండు లక్షలకంటే ఎక్కువ నగదు ఆమోదించే వారికి అంతేస్థాయి నగదు జరిమాన విధిస్తారు. అక్రమ లావాదేవీలు అదుపు చేయటంతోపాటు అవినీతిని అరికట్టేందుకే నగదు లావాదేవీలను రెండు లక్షలకు పరిమితం చేస్తున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. నగదు లావాదేవీలను మూడు లక్షలకు పరిమితం చేస్తామని బడ్జెట్‌లో చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు అకస్మాత్తుగా ఎందుకు మనసు మార్చుకుని కుదింపుప్రతిపాదన చేస్తుందనేది వెల్లడించలేదు. నగదు లావాదేవీల నియంత్రణ కోసమే ఈ పరిమితి విధిస్తున్నట్టు రెవెన్యూ కార్యదర్శి హస్‌ముఖ్ ఆధియా చెబుతున్నారు. నగదు లావాదేవీలపై పరిమితి విధించాలని నల్లధన నియంత్రణపై సిఫార్సులు చేసేందుకు నియమించిన సిట్ ప్రతిపాదించటం తెలిసిందే.