జాతీయ వార్తలు

కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 21: తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాలి, రాష్ట్రానికి ప్రకటించిన అఖిల భారత వైద్య విజాన సంస్థ ఏర్పాటుకు వెంటనే నిధులు విడుదల చేయాలని టిఆర్‌ఎస్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఆమె మంగళవారం లోక్‌సభలో ఆర్థిక బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొంటూ మొదట చేసిన వ్యాఖ్యలకు సభ్యులు గొళ్ళున నవ్వారు. ‘ నా సోదరుడు రామమోహన్ నాయుడు (టిడిపి) మాట్లాడుతుంటే తాను ఏపీ శాసన సభలో ఉన్నానా అనే అనుమానం కలిగింది, ఆ తరువాత కొత్త ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతుంటే ఉత్తర ప్రదేశ్ శాసన సభలో ఉన్నానా? అనే అనుమానం కలిగింది’ అని కవిత చెప్పగానే సభలో ఉన్న ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీతోపాటు అన్ని పక్షాల సభ్యులు గొళ్ళున నవ్వారు.
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమితులైన ఆదిత్యనాథ్‌ను ఆమె అభిమానించారు. యోగి ఆదిత్యనాథ్ ఈరోజు లోక్‌సభలో ఆర్థిక బిల్లుపై మాట్లాడారు. లోక్‌సభ సభ్యుడిగా ఇది ఆయన ఆఖరు ప్రసంగం. రామమోహన్ నాయుడు, యోగి ఆదిత్యనాథ్ కేంద్ర ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు, ఎందుకంటే వారికి కేంద్రం ఎంతో మేలు చేసింది, అయితే తెలంగాణకు కేంద్రం నుండి అందిన సహాయం చాలా తక్కువ కాబట్టి తాను ప్రశంసించలేనని ఆమె స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఒక ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి అర్థిక సహాయం చేస్తున్నారు, ఇదే విధంగా తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టును కూడా జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి నిధుల కేటాయించాలని కవిత డిమాండ్ చేశారు. తెలంగాణకు ఎయిమ్స్ (అఖిల భారత వైద్య విజాన సంస్థ) ను ఇచ్చినందుకు అరుణ్‌జైట్లీకి కృతజతలు తెలిపిన కవిత దీని నిర్మాణానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఆశించిన స్థాయిలో సహాయం చేయటం లేదని ఆమె విమర్శించారు.
ప్రణాళిక, ప్రణాళికేతర వ్యవస్థను తొలగించటం, రైల్వే బడ్జెట్‌ను విడిగా ప్రతిపాదించే విధానానికి స్వస్తి పలకటాన్ని ఆమె సమర్థించారు. బడ్జెట్‌ను ఒక నెల రోజులు ముందుకు జరపటం వలన రాష్ట్రాలు ఆయా పథకాలను అమలు చేసేందుకు వీలు కలుగుతుందన్నారు. కేంద్రం నుండి ఆయా రాష్ట్రాలకు కేటాయించే నిధుల శాతం తగ్గిపోయింది, దీని వలన రాష్ట్రాలకు నష్టం కలుగుతుందని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద నోట్ల రద్దు వలన తెలంగాణకు ఎనిమిది వందల కోట్ల నష్టం కలిగిందన్నారు. తెలంగాణకు చెల్లించవలసిన 850 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు.