జాతీయ వార్తలు

నోట్లను మార్చుకోలేని వారి సంగతేమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 21: పెద్దనోట్ల రద్దు గడువులోగా పాత నోట్లను మార్చుకోని ఎన్‌ఆర్‌ఐలు, విదేశాలకు వెళ్లిన వ్యక్తులకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టుగానే సరైన కారణాలున్న పౌరులకు ఆ అవకాశం ఎందుకు కల్పించలేదని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు మంగళవారం ప్రశ్నించింది. సరైన కారణాలుంటే 2016 డిసెంబర్ 30న గడువు ముగిసిన తర్వాతకూడా పాతనోట్లను మార్చుకోవచ్చంటూ నవంబర్ 8న జాతి నుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారని, అందుకు రిజర్వు బ్యాంకు వెసులుబాటు ఎందుకు కల్పించలేదని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. 2017 మార్చి 31 వరకు సరైన కారణాలుంటే పాత నోట్లను జమచేసే అవకాశం ఉంటుందని మోదీ తన ప్రసంగంలో స్పష్టం చేశారు. ఇందుకు అవకాశం ఉన్నా 2017 మార్చి 31 వరకు పాత నోట్లను సరైన కారణాలతో మార్చుకునే అవకాశాన్ని ఎందుకు కల్పించలేదని కేంద్రాన్ని ప్రశ్నించింది. ఇందుకు సంబంధించి సరైన నిర్ణయం తీసుకోకపోవడానికి దారితీసిన కారణాలను వివరించాలని ఆదేశించింది. ఏప్రిల్ 11లోగా కారణాలను వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని న్యాయమూర్తులు వైవి చంద్రచూడ్, ఎస్‌కె కౌల్‌లతో కూడిన ఈ ధర్మాసనం కేంద్రానికి స్పష్టం చేసింది.